యంగ్ హీరో నాని కెరీర్లో తన స్టార్డం, మార్కెట్ స్థాయిని పెంచిన సినిమా ‘భలే భలే మగాడివోయ్’. నాని తనలోని కామెడీ టైమింగ్ ని పూర్తిగా తెలుగు వారికి పరిచయం చేసిన సినిమా ఇది. అటు డైరెక్టర్ మారుతికి, ఇటు నాని కెరీర్లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లా మిగిలిపోయింది. ఈ సినిమా అప్పుడు థియేటర్స్ లో ఇప్పుడు బుల్లితెర మీద ప్రేక్షకులకు నవ్వులు పంచుతూనే ఉంది.
మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం నాని – మారుతి కాంబినేషన్ కి రెండోసారి రంగం సిద్ధమైంది. నాని- మారుతి సినిమాని సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. నాని ఇటీవలే వి మూవీ షూట్ ని ఫినిష్ చేసి, త్వరలో టక్ జగదీష్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
నాని బిజీగా ఉండడం వలన ఈ సినిమా తరవాత మారుతీ సినిమా మొదలవనుంది. అక్టోబర్ నుంచి మారుతి – నాని సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ప్రత్యేక సమాచారం. అంచనాలను పెంచేస్తున్న ఈ కాంబినేషన్ లో రెండవ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే..
934456 163098Perfectly composed content , thankyou for entropy. 75869