Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: సీరత్ కపూర్ – ఆడిషన్ ఇస్తుంటే రానా గారు కూడా షాక్ అయ్యారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘రన్ రాజా రన్’, ‘టైగర్’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాలలో మెప్పించిన సీరత్ కపూర్ నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’. జూన్ 25న నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. కానీ ఈ సినిమాలో సీరత్ కపూర్ చేసిన రుక్సార్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేము సీరత్ తో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీకోసం..

ఈ లాక్ డౌన్ టైంలో మీరు పేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి? అలాగే కోవిడ్ పాండెమిక్ నుంచి ఏం నేర్చుకున్నారు?

నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏమీ లేదు. నేను ఇంట్లో ఉన్నా వర్క్స్ తో బిజీగానే ఉంటాను. కావున పెద్ద వర్రీ కాలేదు. ఏం నేర్చుకున్నాను అంటే ఆ పరిస్థితుల్లో నేను ఫామిలీతో ఉన్నాను, నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ బయట చాలా మంది ఫుడ్ లేక, చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వీలైనంత వరకూ మనం ఏం హెల్ప్ చేయగలం అనేది ఆలోచించి, వీలైనంత హెల్ప్ చేసాను. ఈ పాండెమిక్ వలన నాలో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. పోస్ట్ లాక్ డౌన్ తర్వాత అందరూ మన అనుకొని రెస్పాన్సిబుల్ గా ఉండాలనేది ఈ పాండెమిక్ నేర్పించింది అనుకుంటున్నాను.

థియేటర్ రిలీజ్ కోసం చేసిన కృష్ణ అండ్ హిస్ లీల ఓటిటిలో రిలీజ్ కావడంపై మీ రియాక్షన్ ఏంటి?

ఈ లాక్ డౌన్ టైంలో అందరూ ఇంట్లో ఉండిపోయారు. ఇలాంటి టైంలో మా సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యి అందరికీ ఎంటర్టైన్ చేయనుంది అనేది మా టీం అందరికీ ఆనందాన్ని ఇచ్చిన విషయం. కానీ సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్స్, మీడియా ఇంటర్వ్యూస్, ఫిల్మ్ టూర్స్ ఇవన్నీ నాకు ఐడియా ఉంది. కానీ ఈ కోవిడ్ టైంలో ప్రమోషన్స్ ఎలా ఉంటాయనేది ఆలోచించాను. కానీ ది బెస్ట్ థింగ్ ఏంటంటే.. ఇలా ఆన్ లైన్, లైవ్ ప్రమోషన్స్ వలన మేము డైరెక్ట్ గా ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వగలిగాం. సినిమా చూసాక వాళ్ళు మాతో డైరెక్ట్ గా వారి ఫీలింగ్స్ పంచుకోవడం సరికొత్త ఎక్స్ పీరియన్స్. మాములుగా అయితే మాకు ఫాన్స్ కి మధ్య వారధిలా మీడియా ఉంటుంది. కానీ లైవ్ లో డైరెక్ట్ గా వారి ఫీలింగ్స్ తెలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

రుక్సార్ పాత్రకి రెస్పాన్స్ ఎలా ఉంది.? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?

చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రుక్సార్ పాత్రకి డైలాగ్స్ తక్కువైనా, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో మార్క్స్ కొట్టేసావని అంటున్నారు. స్పెషల్లీ ఆ క్లైమాక్స్ కి అందరూ కనెక్ట్ అయ్యారు. చిన్న రోల్ అయినా ఎక్కువ కాంప్లిమెంట్స్ తెచ్చిన పాత్ర రుక్సార్. ముఖ్యంగా రుక్సార్ అనేది నా రియల్ లైఫ్ కి దగ్గర ఉండే పాత్ర.. అందుకే నేను నటించాను అనడం కంటే నాలా నేను ఉన్నానని చెప్పచ్చు.

చెప్పాలంటే మెయిన్ లీడ్ గా సినిమాలు చేసిన మీరు స్క్రీన్ టైం చాలా తక్కువ ఉన్న రోల్ ని ఓకే చేయడానికి రీజన్ ఏంటి?

అవును మీరు చెప్పింది కరెక్టే, ఈ సినిమా మొదలుపెట్టే టైంకి యాక్టర్స్ అండ్ డైరెక్టర్ అందరూ కొత్తవాళ్లే.. నా పాత్రకి స్క్రీన్ ప్రెజన్స్ కూడా ఎక్కువ ఉండదు. ఇదే మాట రానా గారు కూడా అన్నారు. షూట్ కి ముందు, ఆడిషన్స్ చేస్తున్న టైంలో రానా గారు చూసి షాక్ అయ్యారు. సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నావ్, ఇంత సింపుల్ రోల్ చేయడానికి ఒప్పుకొని, ఆడిషన్ ఇవ్వడమేంటి అని అడిగారు. నో ప్రాబ్లెమ్, వాళ్ళకి అవసరం అయితే ఆడిషన్స్ ఇస్తాను, నాకు క్యారెక్టర్ నచ్చింది, సో నేను చేస్తున్నాను అని చెప్పాను. గ్రేట్ వర్క్ అని మెచ్చుకున్నారు. నా పరంగా ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు. ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ చేస్తున్నామంటే కంఫర్ట్ అండ్ సెక్యూరిటీతో పాటు నా పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. అది ఉంది, అలానే నాకు పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. చెప్పాలంటే లో బడ్జెట్ ఫిల్మ్ అవ్వడం వలన సెట్ లో కొత్త ఎక్స్పీఎరియన్స్ వచ్చింది. నాకు సినిమాలో స్టైలిస్ట్ లేరు, నాకు నేనే స్టైలింగ్ చేసుకున్నాను. మన ఎక్స్పీరియన్స్ సినిమాని, యాక్టర్స్ ని, నిర్మాతలని డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు అనేదాన్ని నమ్ముతాను. కొత్త టీంతో పనిచేసేటప్పుడు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటాం.

సినిమాలో మీకు డైలాగ్స్ తక్కువ ఉంటాయి. కానీ ఎక్స్ ప్రెషన్స్ ద్వారా చాలా ఎక్కువ మాట్లాడారు.. అలాంటి సీన్స్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు?

థాంక్యూ.. థాంక్యూ. ఇదే ఫీడ్ బ్యాక్ చాలా మంది ఫాన్స్ నుంచి వచ్చింది. చెప్పాలంటే ఫస్ట్ టైం ఎలాంటి హోమ్ వర్క్ లేకుండా చేసిన రోల్ రుక్సార్. ఎందుకంటే నా రియల్ లైఫ్ పాత్రకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ పాత్ర ఒప్పుకున్నాను. కృష్ణ పాత్ర కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రతిసారి తన ఐడియాలజీ చెప్తుందే తప్ప ఫోర్స్ చేయదు.

కంటిన్యూగా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి గల కారణం?

స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదు. ఒకేసారి రెండు సినిమాలకి పని చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని సార్లు రైట్ స్క్రిప్ట్ దొరకదు, కొన్ని సార్లు రిలీజ్ లు ఆలస్యం అవుతుంటాయి. ఉదాహరణకి కృష్ణ అండ్ హిస్ లీల 2015లో షూట్ స్టార్ట్ చేసాం.. పలు కారణాలవల్ల ఇప్పుడు విడుదలైంది. కానీ నేను వీలైనన్ని సినిమాలను చేయడానికి రెడీగానే ఉంటాను.

డైరెక్టర్ రవికాంత్ తో పరిచయం చేయడం ఎలా అనిపించింది?

రవికాంత్ నా రోల్ చెప్పినప్పుడే నన్ను నేను చూసుకున్నాను రుక్సార్ పాత్రలో, అందుకే ఈ సినిమా చేసాను. షూట్ ముందు పరిచయం లేదు. షూట్ టైంలో రుక్సార్ పాత్ర చేస్తున్నప్పుడు తను చాలా హ్యాపీ.. నేను ఏం కోరుకుంటున్నానో అలానే చేస్తున్నావు. రియల్ లైఫ్ లో నా రుక్సార్ పాత్రని కలవడం చాలా హ్యాపీగా ఉందన్నాడు. డైరెక్టర్ అలా హ్యాపీ అయ్యారు అంటే ఒక యాక్టర్ కి అంతకన్నా ఏం కావాలి.

మీరో మంచి డాన్సర్.. డాన్స్ ఓరియంటెడ్ సినిమాల్లో చేసే అవకాశం ఏమన్నా ఉందా?

ఎస్.. తప్పకుండా చేస్తాను. క్లాసికల్ డాన్సర్ గా అలాంటి పాత్ర కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తుంటాను. చెప్పాలంటే నేను కమర్షియల్ సినిమాలు చేసినా డాన్స్ నెంబర్ సాంగ్ చేసే అవకాశం రాలేదు. నాలోని డాన్సింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకునే పాత్ర త్వరలోనే నాకొస్తుందని అనుకుంటున్నాను. నేను క్లాసికల్ సింగర్ కూడా, సో యాక్టింగ్, డాన్స్ అండ్ సింగింగ్ మిక్స్ అయిన రోల్ వస్తే చేయాలనేది నా డ్రీం.

తెలుగులో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

‘మా వింత గాధ వినుమా’ అనే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. యునిక్ లవ్ స్టోరీ అని చెప్పాలి. మొదటిసారి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్స్ లో, తమిళ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ సినిమా తెలుగులో నాకు సరికొత్త ఇమేజ్ ఇస్తుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘మీ టూ’ మోమెంట్ పై పలువురు హీరోయిన్స్ రెస్పాండ్ అయ్యారు. మీ కెరీర్లో ఎప్పుడైనా అలాంటి పరిస్థితులకి లోనయ్యారా?

నో.. నో.. నా పరంగా అలాంటివి ఏం జరగలేదు. ఎక్కడైనా అలాంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉందనిపిస్తే వాకౌట్ చేసేసేదాన్ని.

మీరు పనిచేసిన మీ కో స్టార్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..

శర్వానంద్ – కంపోస్డ్ పర్సన్.
సందీప్ కిషన్ – ఆన్ ది గో..
రాహుల్ రవీంద్రన్ – జనరస్ హ్యూమన్ బీయింగ్
నాగార్జున – హంబుల్
రవితేజ – ఎనర్జిటిక్.. ఈ మాట చాలామంది చెప్పుంటారు.. సో డైనమిక్ పెర్సనాలిటీ.
సిద్దు – ఎక్స్ ప్రెస్సివ్.

ఇంటర్వ్యూ – రాఘవ

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...