ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కి సంబంధించి మరో అరెస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా పలువుర్ని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. మందుల కొనోగుళ్ళు, పరికరాల కొనుగోళ్ళు విషయంలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. ఇక, ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీమోహన్‌ని ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ని ఇప్పటికే మురళీమోహన్ హైకోర్టులో దాఖలు చేయడం, ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం, తీర్పుని రిజర్వ్ చేయడం తెల్సిన విషయాలే.
మురళీమోహన్తోపాటుగా, పితాని సత్యనారాయణ తనయుడు సురేష్‌పైనా ఆరోపణలున్నాయి. సురేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై కూడా తీర్పు రిజర్వ్‌లో వుంది. అప్పట్లో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఆదేశాలతో అధికారులు ఎక్కువ ధరకు మందులు, పరికరాలు కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. రాజకీయ విమర్శల్లో ఈ కుంభకోణం విలువ 800 నుంచి 1000 కోట్లుగా ప్రచారంలో వుంది.
కేంద్రం ఆదేశాల మేరకే వ్యవహరించామనీ, ఆ అక్రమాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అచ్చెన్నాయుడు గతంలోనే వివరణ ఇచ్చారు. అయితే, ఆయన అధికారులకు ఇచ్చిన ఓ ‘అధికారిక నోట్’ ఇప్పుడాయన్ని ఇరకాటంలో పడేసింది. ఆ నోట్ విషయంలో కూడా అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చినప్పటికీ, ఆ నోట్ అచ్చెన్న కొంప ముంచినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆయన కుమారుడు కూడా లబ్ది పొందారని, ఈ మొత్తం ఎపిసోడ్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర కూడా వుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. కాగా, ఈ కేసులో పితాని తనయుడు అజ్నాతంలోకి వెళ్ళాడనే ప్రచారం జరుగుతోంది.
295154 440345But a smiling visitor here to share the really like (:, btw excellent pattern . 643671
684231 435563Our own chaga mushroom comes with a schokohutige, consistent, charcoal-like arrival, a entire lot of dissimilar to the style with the normal mushroom. Chaga Tincture 71335
159206 525740I discovered your weblog web site on google and check several of your early posts. Continue to sustain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Searching for forward to studying extra from you in a even though! 606637
568066 232132A actually intriguing examine, I could not concur completely, but you do make some incredibly valid points. 147937