మాచో హీరో గోపీచంద్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. ‘సైరా’ లాంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నా దసరా సెలవులు హెల్ప్ అవుతాయని ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే వారు అనుకున్నది నిజం అయ్యేది. కానీ చాణక్య ప్రేక్షకులను అంతగా మెప్పించకపోవడం వల్ల మొదటి రోజు డిజాస్టర్ అనే కలెక్షన్స్ ని సాధించింది.
చాణక్య సినిమా మొదటి రోజు ఏపీ, తెలంగాణలో సుమారు 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇది గోపీచంద్ కెరీర్లోనే చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే గోపీచంద్ గత సినిమా ‘పంతం’ మొదటి రోజు సుమారు 2.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇకపోతే చాణక్య థియేటర్ బిజినెస్ 11.5 కోట్లు. దసరా సీజన్ హెల్ప్ అయినా మొదటి రోజు 10% మాత్రమే రికవరీ రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ భారీ లాస్ లు వస్తాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగే ఈ రోజు నూన్ షోస్ కూడా చాలా డల్ గా ఉన్నాయి.
