‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కించిన కొత్త సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ హీరోయిన్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి చిత్ర విశేషాలు వివరిస్తూ..
చోర్ బజార్ అంటే..
నా గత చిత్రాలకు భిన్నంగా పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిది. జార్జి రెడ్డికి ముందే రాసుకున్న కథ. 35 రోజులు రాత్రిళ్లు షూటింగ్ చేసినా.. సినిమా కలర్ ఫుల్ గా రావడంలో సినిమాటోగ్రాఫర్ జగదీశ్ టాలెంట్ ని మెచ్చుకోవాలి. చోర్ బజార్ లో మనుషుల స్వభావం ఆకట్టుకుంది. రాత్రి బిజినెస్ చేసి, పగలు నిద్రపోతారు. దొంగతనం చేయకుండా.. మనం వద్దనుకుని పడేసిన వస్తువులను సేకరించి తక్కువ ధరలకు అమ్ముతుంటారు. వారికి ఆధార్ కార్డులు కూడా ఉండవు. ఇలాంటి అంశాల్ని సినిమాలో ప్రస్తావించాం. సినిమా కోసం అక్కడి నుంచి చాలా వస్తువులు తెప్పించాం.
డైమండ్ చుట్టూ..
అక్కడ ప్రతి ఒక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. ఆ స్ఫూర్తితోనే సినిమాలో హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. రికార్డుల కోసం వీడియోలు వైరల్ చేస్తూంటాడు. సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. హీరోయిన్ మూగ పాత్ర. సినిమా లవ్ స్టోరినే అయినా.. విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. డైమండ్ చుట్టూ డ్రామా, ఫన్ ఉంటాయి. ఆకాష్ పూరి తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చెప్పింది చెప్పినట్లు నటించాడు.
పూరి చెప్పిన మాట..
కథ చెప్పేందుకు పూరి జగన్నాథ్ ను కలిస్తే.. రెండు సినిమాల అనుభవం కదా.. అనుకున్నట్లు తీయ్ అని కథ కూడా వినలేదు. మనసుకు నచ్చిన కథలను తెరకెక్కిస్తుంటా. కెరీర్ లెక్కలు వేసుకోవడం రాదు. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా. నాకు గురువు ఆర్జీవీ. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఆ వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తా.
983315 851403Xanax (Alprazolam) is used to treat anxiety disorders and panic attacks. Alprazolam is in a class of 857073
285382 314819This really is a very good subject to talk about. Usually when I locate stuff like this I stumble it. This post probably wont do effectively with that crowd. I is going to be confident to submit something else though. 124055
584721 952085Great post is going to be linking this on a couple of sites of mine maintain up the good work. 203091
811146 500874the most common table lamp these days still use incandescent lamp but some of them use compact fluorescent lamps which are cool to touch.. 608016