టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ఆయన సినిమా టేకప్ చేసాడు అంటే అది 90% హిట్ అని డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా నమ్ముతారు. దిల్ రాజు చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలతో క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం దిల్ రాజు రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా బాహుబలి స్టార్ గా మారిన ప్రభాస్ తో సినిమా చేయడానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రభాస్ నవంబర్ నుంచి రాధాకృష్ణ ‘జాన్(వర్కింగ్ టైటిల్)’ సినిమా షూటింగ్ మొదలు పెడతాడు. అలాగే నవంబర్ మొదటి వారం నుంచి ప్రభాస్ కొత్త కథలు విని తన తదుపరి సినిమాలను లాక్ చేయనున్నాడు. ప్రభాస్ సై అనగానే కథలు చెప్పడానికి చాలా మంది స్టార్ దర్శకులతో పాటు యంగ్ డైరెక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. అందులో ముందుగా ‘సైరా’ ఫేం సురేందర్ రెడ్డి, పరశురామ్ లాంటి దర్శకులు ఉన్నారు.
దిల్ రాజుకి ప్రభాస్ తో ఉన్న క్లోజ్ రాపో వలన ప్రభాస్ ని తన బ్యానర్ లో చేయమని ప్రపోజల్ పెట్టాడు. ఈ విషయంపై ప్రభాస్ ని కాస్త ప్రెజర్ కూడా చేస్తున్నారు. అది కూడా సురేందర్ రెడ్డి నేరేట్ చేసే లైన్ ప్రభాస్ ఓకే చేస్తే, ఆ సినిమానే దిల్ రాజు టేకప్ చేసి, ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
మరి ప్రభాస్ – సురేందర్ రెడ్డి – దిల్ రాజు కాంబినేషన్ పై మీ ఫీలింగ్ ని కామెంట్స్ రూపంలో తెలపండి.
