తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన భారత్ రాష్ట్ర సమితి పార్టీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో వున్నారట. ఈ క్రమంలోనే అందివచ్చే అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకునేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారట. పలువురు కాపు నేతల్ని ఇప్పటికే ఏపీ నుంచి బీఆర్ఎస్ వైపుకు మళ్ళించారు కేసీయార్. అందులో జనసేన పార్టీ నుంచే ఎక్కువమందిని బీఆర్ఎస్ లాగేస్తోందన్నది నిర్వివాదాంశం.
‘కాపు ముఖ్యమంత్రి’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలన్నది బీఆర్ఎస్ వ్యూహమట. హైద్రాబాద్ నుంచే బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కేటీయార్.. ఈ మేరకు తనదైన వ్యూహాల్ని అమలు చేసేస్తున్నారు కూడా.! ముందు ముందు ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ అనూహ్యమైన రీతిలో సత్తా చాటుతుందన్నది ఆ పార్టీ నేతల వాదన.
అంతా బాగానే వుందిగానీ, ఈ ‘కాపు ముఖ్యమంత్రి’ నినాదమేంటి.? తెలంగాణలో దళితుడే తొలి ముఖ్యమంత్రి.. అని నినదించిన కేసీయార్, తెలంగాణలో అధికారం దక్కగానే, ఆ ‘ధళిత ముఖ్యమంత్రి’ వ్యవహారాన్ని మర్చిపోయారు. ఈ విషయమై కేసీయార్, జనానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని ప్రతిసారీ ఎదుర్కొంటూనే వున్నారాయె.
సో, కేసీయార్ తెరపైకి తెస్తున్న ‘కాపు ముఖ్యమంత్రి’ నినాదాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి అయితే లేదు. కానీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఖచ్చితంగా, ఏపీ రాజకీయాలపై కొంత ప్రభావం చూపుతుంది. అయితే, అదంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు. ముందైతే, తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టెక్కాల్సి వుంటుంది.
కేవలం తెలంగాణలో గట్టెక్కడానికే ఈ ఏపీలో కాపు ముఖ్యమంత్రి నినాదం తప్ప, బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ముందు ముందు కూడా వుండకపోవచ్చు. కేసీయార్, ‘బీఆర్ఎస్’ పేరుతో చెబుతున్న మాటలకీ, చేస్తున్న పనులకీ అస్సలు పొంతన వుండడంలేదాయె.! వుండదు కూడా.!
449508 774167No much more s . All posts of this qaulity from now on 466197
653696 815155An attention-grabbing dialogue is value comment. I believe that you want to write a lot more on this matter, it wont be a taboo topic however usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 269281
771905 757067I adore reading and I conceive this web site got some genuinely utilitarian stuff on it! . 767686
692723 416426Thank you for your really great data and feedback from you. car dealers san jose 565582