Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 30 జనవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ 6:37
సూర్యాస్తమయం : సా‌.5:50
తిథి: పుష్య బహుళ త్రయోదశి మ 3:58 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము : పూర్వాషాఢ రా.11:32 ని.వరకు తదుపరి ఉత్తరాషాఢ
కరణం: వనిజ. మ.3:58 వరకు
యోగం: హర్షణం. మ.1:24 వరకు తదుపరి వజ్రం
వర్జ్యం: ఉ.10:06 నుండి 11:35 వరకు
దుర్ముహూర్తం.సా.4:13 నుండి 4:57 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం:మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం :మ.3:18 నుండి 4:42 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి ఉ .6:04 వరకు
అమృతఘడియలు: ‌రా.7:03 నుండి 8:32 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:51 వరకు

ఈరోజు. (30-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

వృషభం: దూరప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి.

మిథునం: పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కర్కాటకం: కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

సింహం: భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

కన్య: వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

తుల: బంధువులతో ఏర్పడిన వివాదాలు రాజి చేసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం: కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు: నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మకరం: రుణ బాధల నుంచి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి.

కుంభం: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది.

మీనం: అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహనిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...