Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 22 జూలై 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ

సూర్యోదయం: ఉ.5:39
సూర్యాస్తమయం: రా.6:34 ని.లకు
తిథి: అధిక శ్రావణ శుద్ధ చవితి ఉ.6:09
సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం)
నక్షత్రము: పుబ్బ మ.2:46 ని.వరకు తదుపరి ఉత్తర
యోగం: వరీయన్ మ.12:20 ని. వరకు తదుపరి పరీఘ
కరణం: భద్ర ఉ.6:09 వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.5:39 ని.నుండి 7:22 ని.వరకు
వర్జ్యం : రా.10:37 ని.నుండి 12:22 ని. వరకు
రాహుకాలం: ఉ.9:00 గం..నుండి 10:30 ని.వరకు
యమగండం: మ.1:30 ని నుండి 3:00గం.వరకు
గుళికా కాలం: తె.5:55 నుండి 7:32. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:19 ని.నుండి 5:07 ని.వరకు
అమృతఘడియలు: ఉ.9:38 నుండి 11:24 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.9:46 ని.నుండి 11:34 ని.వరకు

ఈరోజు (22-07-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మిధునం: చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం: ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం: ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య: పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

తుల: సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయం బాగుంటుంది.

వృశ్చికం: దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలసివస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

ధనస్సు: సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది.

మకరం: వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

కుంభం: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.

మీనం: రాజకీయ వర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...