Switch to English

క్రికెట్‌ దేవుడు.. ‘సచిన్‌’ మాత్రమే ఎందుకు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

క్రికెట్‌లో ఎందరో మహానుభావులు.. అయినా, సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే క్రికెట్‌ దేవుడిగా కొనియాడబడ్తున్నాడు. ఎందుకు.? ఎందుకంటే, క్రికెట్‌కి ఆయన అందించిన సేవలు అలాంటివి మరి. సెంచరీలు కొట్టడం, ఒంటి చేత్తో టీమిండియాని గెలిపించడమే కాదు.. అంతకు మించి క్రికెట్‌ని ఓ మతంగా మార్చేశాడు సచిన్‌ టెండూల్కర్‌. అందుకే, క్రికెట్‌ అనే మతానికి సచిన్‌ టెండూల్కర్‌ని దేవుడిగా భావిస్తుంటారు అతని అభిమానులు. సచిన్‌ అంటే భారత క్రికెట్‌ అభిమానులకి మాత్రమే ‘భక్తి’ అనుకుంటే పొరపాటే, ప్రపంచ వ్యాప్తంగా సచిన్‌ టెండూల్కర్‌కి భక్తులున్నారు. వందలాది, వేలాది మంది భక్తులు కాదు.. లక్షలాది, కోట్లాది మంది అభిమానులు.

అత్యంత చిన్న వయసులోనే క్రికెట్‌లోకి అడుగు పెట్టిన సచిన్‌ టెండూల్కర్‌కి, అంతర్జాతీయ క్రికెట్‌ ఏమంత గొప్పగా స్వాగతం పలికేయలేదు. ‘హైట్‌ తక్కువ కావడం’తో మొదట్లో సచిన్‌ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో అంతెత్తున అతి భీకరంగా వుండే చాలామంది బౌలర్లను సచిన్‌ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో గాయాలపాలయ్యాడు కూడా. బ్యాట్‌ నుంచి పరుగులు వస్తే సరేసరి, రాకపోతే ఇంకేమన్నా వుందా.? విమర్శకులు తమ విమర్శలకు పదును పెట్టేవారు.. సచిన్‌ మీద విమర్శల బౌన్సర్లతో విరుచుకుపడేవారు.

కెరీర్‌ మొదలైనప్పటినుంచీ, ముగిసేదాకా క్రికెట్‌ని ఆస్వాదించడం కంటే, విమర్శకులకు సమాధానం చెప్పడానికే సచిన్‌ ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందనడం అతిశయోక్తి కాదేమో. ‘సచిన్‌ పనైపోయింది..’ అనే విమర్శ వచ్చిన ప్రతిసారీ, తన బ్యాట్‌కి పదును పెట్టాల్సి వచ్చేది.. దాంతో సచిన్‌, సరికొత్త షాట్లను ఎంచుకునేవాడు. ఎప్పటికప్పుడు క్రికెట్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడమే, సచిన్‌ క్రికెట్‌లో ఈ స్థాయికి ఎదగడానికి కారణమని నిస్సందేహంగా చెప్పొచ్చు.

క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ సచిన్‌ సత్తా చాటిన విషయం విదితమే. 200 టెస్ట్‌లు ఆడాడు, 453 వన్డేలు ఆడాడు.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ విషయానికొస్తే మ్యాచ్‌ల సంఖ్య 310. టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ డబుల్‌ సెంచరీలు కొట్టాడు. అంతే కాదు, బౌలర్‌గానూ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు.. ఆ వికెట్ల సంఖ్య 200. 35 వేలకు పైగా పరుగులు సచిన్‌ బ్యాట్‌ నుంచి జాలువారాయి.. ఇది అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించిన లెక్క. చెప్పుకుంటూ పోతే, సచిన్‌ ఘనవిజయాల గురించి రోజులు సరిపోవు.

సచిన్‌ రికార్డుల్ని ఇంకెవరైనా అధిగమించొచ్చుగాక. అది వేరే విషయం. కానీ, జట్టు కోసం సచిన్‌ పడ్డంత కష్టం, మాత్రం ఇంకే ఇతర క్రికెటర్‌ నుంచీ ఆశించలేం. మైదానంలో కండరాలు పట్టేసి, బాధతో విలవిల్లాడిపోయినా బ్యాట్‌ని వదిలేవాడు కాదు సచిన్‌ టెండూల్కర్‌. పేరు కోసం కాదు, దేశం కోసమే ఆ కష్టాన్ని భరించేవాడు. ఇంతా చేసినా, సచిన్‌పై విమర్శలు ఆగేవి కాదు. ‘కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే సచిన్‌ క్రికెట్‌ ఆడతాడు.. సెంచరీల లెక్కేసుకుంటాడు..’ అనే విమర్శలు సచిన్‌ చుట్టూ చాలానే వచ్చాయి. కానీ, సచిన్‌ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు.

‘నేను క్రికెట్‌ ఆడుతున్నది నా కోసం కానే కాదు.. దేశం కోసమే క్రికెట్‌ ఆడుతున్నాను.. క్రికెట్‌ని ఆస్వాదిస్తున్నాను. నా శరీరం, వయసు సహకరించని రోజు క్రికెట్‌కి వీడ్కోలు చెప్పడం బాధాకరమే అయినా, ఆ నిర్ణయాన్నీ సంతోషంగా తీసుకుంటాను..’ అని ఎప్పుడూ సచిన్‌ చెప్పేవాడు.. అలా చెప్పినట్టుగానే, సచిన్‌ తనకెంతో ఇష్టమైన క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పాడు కూడా. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సచిన్‌ ఆడినప్పుడూ, తన కోసం కాదు, తన జట్టు కోసం.. దేశం కోసమే ఆడాడు. జట్టులో వున్న యువ ఆటగాళ్ళను సచిన్‌ ప్రోత్సహించిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.?

‘సచిన్‌తో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం ఆనందించదగ్గ విషయమే కాదు.. అదొక అద్భుతం. దేవుడితో కలిసి వున్నట్లనిపించేది.. క్రికెట్‌ నిఘంటువులా సచిన్‌ కనిపించేవారు. గొప్ప క్రికెటర్‌ అన్న అహం ఆయనలో మేమెప్పుడూ చూడలేదు. క్రికెట్‌ ఎలా ఆడాలన్నదానికంటే, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినా క్రికెట్‌ని ఎలా ఆస్వాదించాలి.? దేశానికి క్రికెటర్‌గా ఎలా సేవలందించాలి.? అన్న విషయాల్ని ఆయన గురించి నేర్చుకున్నాం..’ అని చాలామంది యంగ్‌ క్రికెటర్‌లు, సచిన్‌తో వున్నప్పటి తమ అనుభవాల్ని గుర్తు చేసుకుంటుంటారు.

పరుగులు, రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే ముందే చెప్పుకున్నాం కదా, సమయం సరిపోదని.! అదీ సచిన్‌ ఘనత. చిన్న జట్టుతో ఆడినా, పెద్ద జట్టుతో ఆడినా సచిన్‌లో ఒకే ఉత్సాహం వుండేది. కొత్తగా క్రికెట్‌లోకి ఏ బౌలర్‌ వచ్చినా, సచిన్‌కి బౌలింగ్‌ చేయాలనీ, అతని వికెట్‌ తీయాలనీ అనుకునేవారు.. దాన్నొక ఛాలెంజింగ్‌గా భావించేవారు. కొందరు సచిన్‌ని భయపెట్టేందుకు ప్రయత్నించారు.. సచిన్‌ని ఔట్‌ చేసి సరదా పడ్డారు.. అఫ్‌కోర్స్‌, సచిన్‌ కూడా వారికి బ్యాట్‌తో తనదైన స్టయిల్లో సమాధానం చెప్పేవాడనుకోండి.. అది వేరే విషయం.

సచిన్‌కి బౌలింగ్‌ చేసిన బౌలర్లంతా ఒకటే మాట చెబుతారు, ‘తమ కెరీర్‌లో సచిన్‌ అత్యంత సంక్లిష్టమైన ఆటగాడు’ అని. అదే సమయంలో, ‘ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాం.. ఆయన నిజాంగానే క్రికెట్‌కి దేవుడు’ అని. భారత క్రికెటర్లే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానులూ ఆయన్ని దేవుడిగానే చూస్తారు. ‘నేను దేవుడ్ని కాదు, మామూలు మనిషిని మాత్రమే. ఆటను ఆస్వాదించాను.. అదే నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది..’ అని చెప్పగలిగే హుందాతనం సచిన్‌కి కాక ఇంకెవరికి వుంది.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....