పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య వకీల్ సాబ్ విడుదలవుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుండడంతో వారి ఉత్సాహానికి అవధుల్లేవు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ రిలీజ్ కు సర్వం సిద్ధమవుతుండగా కరోనా నీడలు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ విధించారు. తెలంగాణలో అలాంటిదేం లేదని చెప్పినా రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో ఏ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి.
వకీల్ సాబ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 75 కోట్ల రూపాయలు దాటింది. అంత భారీ బిజినెస్ ను 50 శాతం సీటింగ్ కెపాసిటీ ఉంటే రికవర్ చేయడం కష్టమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
859690 961185hi and thanks for the actual weblog post ive lately been searching regarding this specific advice on-line for sum hours these days as a result thanks 659542