Switch to English

చంద్రబాబు సక్సెస్ అయినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే విషయంలో టీడీపీ అధినేత దాదాపుగా సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. ఈనెల 21 లేదా 22న విపక్ష పార్టీల సమావేశానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందుగానే విపక్షాల భేటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ముందు నుంచీ పట్టుదలగా ఉన్నారు. అయితే, ఈ విషయంలో ఆయనకు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాయావతి నుంచి తొలుత ఝలక్ తగిలింది. ఫలితాలు రాకముందే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తానంటూ చంద్రబాబు చెప్పడంపైనా ఆమె గుస్సా అయినట్టు సమాచారం. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం తన పట్టు వీడలేదు. ఎలాగైనా కాంగ్రెస్ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందుకోసం పలు పార్టీల అధినేతలను కలుస్తూ.. వారిని ఒప్పించే పనిలో పడ్డారు.

తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత లక్నో వెళ్లి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫలితాల కంటే ముందుగానే విపక్షాలు సమావేశం కావాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు. ఫలితాల కంటే ముందుగానే విపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి ఆహ్వానం పొందడం సులభం అవుతుందని వివరించినట్టు సమాచారం. అందువల్లే ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలితాలు విడుదలయ్యే 23వ తేదీ కంటే ముందుగానే విపక్ష పార్టీలన్ని కలిసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు అఖిలేష్, మయావతి కూడా అంగీకరించినట్టు సమాచారం. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా బెట్టు వీడి ఈ సమావేశానికి హాజరైతే అది బీజేపీకి ఎదురుదెబ్బగానే భావించక తప్పదు.

వాస్తవానికి విపక్షాల్లోని అనైక్యతే ఇన్నాళ్లూ బీజేపీ బలంగా ఉంటూ వచ్చింది. అయితే, మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఒకటి కావడం ప్రారంభించాయి. యూపీలో బద్ధ శత్రువులగా ఉన్న ఎస్సీ, బీఎస్పీ కలసి పోటీచేయడం ఇందుకు నిదర్శనం. అలాగే వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో, వారితో చర్చలు జరపడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో తన పరిచయాల్ని వినియోగించుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి రావడానికి అవకాశం ఉన్న ప్రతి పార్టీని కూడా ఒప్పించడానికి శతధా కృషి చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే కూడా చంద్రబాబే ఎక్కువ కష్టపడ్డారు. ఆ పార్టీ నేతలు చేయాల్సిన పనిని బాబు ఒక్కరే చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కితే మాత్రం కచ్చితంగా ఆ క్రెడిట్ మాత్రం బాబుదే అని విశ్లేషకులు అంటున్నారు.

విపక్షాలను ఏకం చేయడంతోపాటు ప్రధాని పదవి విషయంలో కాంగ్రెస్ కాస్త వెనక్కి తగ్గేలా కూడా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. వాస్తవానికి ప్రదాని పదవిపై చాలామంది కన్నేశారు. ఇదే వారిలో ఐక్యతకు అడ్డంకిగా మారింది. ముఖ్యంగా మమతా బెనర్జీ కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదే. ఈ సందర్భంలో బాబు తన రాజకీయ చతురతను ఉపయోగించి వారందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ కు 140 కంటే ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీకి, అంతకంటే తక్కువ వస్తే కూటమిలోని ఇతర పార్టీలకు ప్రధాని పదవి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్టుగా చెబుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ సమ్మతించినట్టు సమాచారం. దీంతోనే విపక్షాల భేటీ దాదాపుగా ఖరారైందని అంటున్నారు. మొత్తమ్మీద 21 లేదా 22న ఈ పార్టీల సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...