Switch to English

చంద్రబాబు తన స్థాయిని తగ్గించేసుకుంటున్నారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఐదేళ్లు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల పోలింగ్‌ ముగిశాక, అధికారుల విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియక తికమక పడుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందంటే, అధికారంలో ఉన్నవారి అధికారాలపై కోత ఉంటుంది. అధికారులు ఎన్నికల సంఘం నిర్ణయాలకు లోబడి పని చేస్తారు. చంద్రబాబుకు ఇవన్నీ తెలియదని ఎలా అనుకోగలం.?

ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌ని మార్చడం, సీఎస్‌ని బదిలీ చేయడం, కొందరు ఐపీఎస్‌ అధికారులపై వేటు వేయడం, ఐఏఎస్‌ అధికారులూ బదిలీ వేటుకు గురి కావడం.. ఇలాంటివన్నీ అసాధారణమేమీ కాదు. కానీ ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంత పెద్ద దుమారం రేగడం ఖచ్చితంగా అశ్యంతరకరమే. దాన్ని ప్రశ్నిస్తూ, ఓ సీనియర్‌ పొలిటీషియన్‌గా చంద్రబాబు రాజకీయ పోరాటం చేయొచ్చు. దాన్నెవరూ తప్పు పట్టలేరు. కానీ ఎన్నికల సంఘంలో నిర్ణయాలకు లోబడి పని చేసే అధికారుల్ని తూలనాడడం ద్వారా చంద్రబాబు సాధించేదేమీ లేదు.

చంద్రబాబు ప్రస్తుత అధికారాలపై ఛీఫ్‌ సెక్రటరీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం స్పష్టత ఇచ్చారు. దాని అర్ధం చంద్రబాబుకు ఇప్పుడు అధికారాలు పూర్తి స్థాయిలో లేవని. అది నిజమే. కానీ సీఎస్‌తో చెప్పించుకునే స్థాయికి చంద్రబాబు వివాదాన్ని తీసుకెళ్లడమే దారుణం. రేపొద్దున్న చంద్రబాబే తిరిగి ముఖ్యమంత్రి అవ్వొచ్చు గాక, అప్పుడు ఇదే సీఎస్‌తో కలిసి పని చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చు, లేదా ప్రస్తుత సీఎస్‌ని తొలగించి, తనకు కావల్సిన అధికారిని ఆ పోస్ట్‌లో కూర్చోబెట్టుకునే అవకాశం చంద్రబాబుకు ఉంటుంది. కేవలం నెలా పదిహేను రోజుల వ్యవధికి గానూ అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్‌, ఆ కారణంగా జరిగిన మార్పుల గురించి చంద్రబాబు ఇంతలా ఆయాస పడడం సీనియర్‌ పొలిటీషియన్‌గా ఆయనకు తగని పని.

ఓటమిని ముందే పసిగట్టి మిగిలిన కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికే చంద్రబాబు అధికారులపై అత్యుత్సాహం చూపుతున్నారనీ సంకేతాలు ఆల్రెడీ జనంలోకి వెళ్లిపోయాయి. ఇంకా ఈ వివాదాన్ని తెగేదాకా లాగడం, చంద్రబాబుకు మంచిది కాదనీ, రాజకీయ పండితులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, తుపాను ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌పై దాని ప్రభావాన్ని అంచనా వేయడంలో అధికార యంత్రాంగం కొంత నిర్లిప్తత చూపిస్తున్నట్లే కనిపిస్తోంది. మరో పక్క తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం అది రాష్ట్రానికి ఈ పరిస్థితుల్లో పెను శాపమే.

తుపాను పట్ల అప్రమత్తత ఏదీ.? అని టీడీపీ ప్రశ్నించడాన్ని కూడా ప్రతిపక్షం తప్పుపడుతోంది. విపత్తుల విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఒకే మాట మీద ఉండాలి. దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఐక్యత ఎప్పటికీ కనిపించకపోవచ్చు. ముఖ్యమంత్రి, క్యాబినెట్‌ అనే వ్యవస్థ మరీ అచేతనావస్థలో ఉండదు కనుక అధికార యంత్రాంగం కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమయంలో ప్రభుత్వ పెద్దలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...