Switch to English

చంద్రబాబు చేసిన తప్పులివేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం ఆ పార్టీ నేతలనే కాదు.. రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే గెలుపు అని అన్ని రకాల సర్వేలూ నిర్ధారించినప్పటికీ, ఈ స్థాయిలో ఏకపక్ష విజయం వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో వైఎస్సార్ సీపీకి సీట్లు వస్తాయని, వందకు అటూ ఇటూగా అవి ఉండొచ్చని ఎక్కువ మంది ఊహించారు. అయితే, వాస్తవ ఫలితాల్లో మాత్రం 175 స్థానాల్లో ఏకంగా 151 సీట్లు ఆ పార్టీకి దక్కడం.. టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం కావడం పలువురిని విస్మయపరిచింది.

తెలుగుదేశం పార్టీ నేతలు సైతం తమకు ఓటమి తప్పదని భావించినా, మరీ ఇంత దారుణమైన పరాభవం ఉంటుందని అనుకోలేదు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం వారు బాగా డీలా పడిపోయారు. తమ ఓటమికి కారణాలేమిటా అని విశ్లేషించుకుంటున్నారు. ఇంతకీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమికి కారణాలేమిటి? ఎందుకు ఇంత ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది? ఈ ఓటమిలో చంద్రబాబు బాధ్యత ఎంత?

విభజన సమయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అనభవంతుడైన చంద్రబాబు అయితే బాగుంటుందని భావించిన ప్రజలు.. ఆయనకే పట్టం కట్టారు. అప్పటివరకు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఎన్నికలకు మూడు నెలల ముందు మొత్తం మారిపోయింది. ముఖ్యంగా యువత అంతా బాబుకే జైకొట్టారు. కానీ ఈ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. అప్పుడు బాబుకు జైకొట్టిన యువతలో కొంతమంది పవన్ కల్యాణ్ కు, మరికొంతమంది జగన్ కు మద్దతుగా నిలిచారు. దీంతో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇందుకు కారణం చంద్రబాబు చేసిన తప్పులే.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చివరి ఏడాది హడావుడిగా కొన్ని పథకాలను అమలుచేయడానికి ప్రయత్నాలు చేశారు. అప్పటివరకు పట్టించుకోని వర్గాలను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇది ఒక విధంగా బాబుకు మైనస్ గానే మారింది. ఇక నిరుద్యోగ భృతి విషయంలోనూ చంద్రబాబు తప్పటడుగే వేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగికీ రూ.2వేల చొప్పున భృతి ఇస్తానని హామీ ఇచ్చిన బాబు.. తర్వాత చాలాకాలం పాటు ఆ ఊసే మరచిపోయారు. చివర్లో అనేక వడపోతల తర్వాత కొద్ది మందికే ఇచ్చాం అనే పేరుకు ఆ పథకాన్ని వర్తింపజేశారు. ఇదీ కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బాబు వైఖరి తీవ్ర ప్రభావం చూపించింది.

తొలుత హోదా అవసరంలేదన్న ఆయనే.. అనంతరం హోదా కోసం పోరాడుతున్నట్టుగా ప్రయత్నించడం మొదటికే మోసం తెచ్చింది. మరోవైపు కేంద్రం సహకరించడంలేదని, నిధులు ఇవ్వడంలేదని పదేపదే చెప్పిన బాబు.. కొన్ని అంశాల్లో నిధులను బాగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రచార ఆర్భాటానికి భారీగా నిధులు వెచ్చించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక విమానాల్లోనే వెళ్లడం వల్ల నిధులు భారీగా ఖర్చయ్యాయి. రెగ్యులర్ విమాన సౌకర్యం ఉన్న ప్రాంతాలకు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఇక ఒక సెక్షన్ మీడియా ఇచ్చే కథనాలను చూసి, రాష్ట్రం అద్భుతంగా ఉందనే భ్రమలో ఉండిపోవడం కూడా చంద్రబాబు చేసిన పొరపాటే.

బాబు మెప్పు కోసం ఆయా మీడియా వండి వార్చిన కథనాల్లో నిజానిజాలే తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంతా బాగానే ఉందనే భ్రమలో ఉండిపోవడంతో నివారణ చర్యలు చేపట్టలేకపోయారు. ఇక అద్భుతమైన రాజధాని నిర్మిస్తారని నమ్మని జనానికి నిరాశే ఎదురైంది. కేవలం డిజైన్ల ఎంపికకే రెండేళ్ల సమయం తీసుకున్న చంద్రబాబు.. తాత్కాలిక భవనాలు తప్ప.. శాశ్వత భవనాలు నిర్మించలేకపోయారనే అపవాదు ఎదుర్కొన్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో తీవ్రంగా ఉన్న వ్యతిరేకతను గుర్తించినా, వారిని మార్చే ప్రయత్నం చేయకపోవడం ఎన్నికల్లో విజయంపై ప్రభావం చూపించింది. ఇక అదేపనిగా సమీక్షలతో అధికారులను గంటల తరబడి వేచి చూసేలా చేయడం కూడా వారిలో వ్యతిరేకతకు కారణమైంది. ఇలాంటి మరెన్నో అంశాలే తెలుగుదేశం ఘోర పరాజయానికి కారణాలని చెప్పక తప్పదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...