Switch to English

తొక్కితే, పైకి లేచే ఛాన్సుందా చంద్రబాబూ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ, ఇటీవలి ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌లోనూ దెబ్బతినేసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని టీఆర్‌ఎస్‌ ఏ స్థాయిలో ‘తొక్కేసిందో’ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేకపోయింది. టీడీపీ తరఫున తెలంగాణలో ఇప్పుడు చెప్పుకోదగ్గ నాయకుడు లేడంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

మరి, 2024 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా వుండబోతోంది.? ఏమోగానీ, చంద్రబాబు మాత్రం ‘మమ్మల్ని ఎంతగా మీరు తొక్కేయాలనుకుంటే.. అంత గట్టిగా నిలబడి చూపిస్తాం.. ఎంత తొక్కితే అంత పైకి లేస్తాం..’ అని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలిప్పుడు రాజకీయ వర్గాల్లో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

నలుగురు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నికలు పూర్తయ్యాక నెల రోజులు కూడా కాపాడుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. పైగా, అందులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైనవారు. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జాగుతోంది. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలలో 16 మంది జారిపోతే, తెలుగుదేశం పార్టీ ఉనికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నార్థకమవుతుందన్నది నిర్వివాదాంశం.

ఎన్నికలయ్యాక, విహార యాత్ర కోసం విదేశాలకు వెళ్ళొచ్చిన చంద్రబాబు, పార్టీ పటిష్టత కోసం సరైన చర్యలు ఇప్పటిదాకా చేపట్టింది లేదు. రాష్ట్రమంతటా పర్యటిస్తాననీ, కార్యకర్తలకు అండగా వుంటాననీ చంద్రబాబు తాజాగా సెలవిచ్చారుగానీ, నిజంగానే చంద్రబాబులో అంత ఓపిక వుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

రాజకీయాలు గతంలోలా లేవు. 2004 ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు మొత్తం పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా బలంగా నిలబడగలిగారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఓడిపోవడమంటే.. అంతే సంగతులు. జగన్‌ నిలబడలేదా.? అంటే, అందుకు కారణాలు వేరే వున్నాయి. అంతలా సానుకూల పరిస్థితులు చంద్రబాబుకి మాత్రం లేవని నిస్సందేహంగా చెప్పొచ్చు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....