Switch to English

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం శీతకన్ను

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రతిష్టాత్మక వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోంది. స్టీల్ అభివృద్ధిని పట్టించుకోవడం మానేసి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి ప్రాధాన్యతనిస్తోంది. స్టీల్ ప్లాంటుకు చెందిన విలువైన భూములను ఆ కంపెనీకి దారాధత్తం చేస్తోంది. హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన పోస్కోకు ఇప్పటికే 900 ఎకరాలు కేటాయించింది. అలాగే మరో 900 ఎకరాలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు.. విశాఖ ఉక్కును కాలరాసే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ మూడో దశ విస్తరణ ప్రతిపాదనలను పక్కన పెట్టేయడంతోపాటు పోస్కో కంపెనీ అభివృద్ధికి పాటుపడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి పోస్కో కంపెనీ ఒడిశాలో స్టీల్ ప్లాంటు పెట్టాలని దాదాపు 15 ఏళ్లు ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలో ఏపీకి వచ్చిన ఆ కంపెనీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంటు వద్ద దాదాపు 26వేల ఎకరాల భూములు ఉండటంతోపాటు పోర్టు నిర్మించుకోవడానికి అనువైన స్థలం ఉండటంతో ఆ దిశగా పావులు కదిపింది. హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో విశాఖ ఉక్కుతో ఒప్పందం కుదిరేలా చేసింది.

ఏడాదికి 50 లక్షల టన్నుల ఉత్పత్తి చేసే లక్ష్యంతో పోస్కో కంపెనీ ప్లాంటు పెట్టనుంది. ఇందుకు దాదాపు రూ.35వేల కోట్ల పెట్టుబడి పెట్టనుందని సమాచారం. ఇందుకోసం తమకు 1170 ఎకరాలు కేటాయించాలని కంపెనీ కోరగా.. ఇప్పటికే 900 ఎకరాలను కేంద్రం కేటాయించింది. ఈ భూములు లీజుకు ఇస్తున్నారా లేక విక్రయిస్తున్నారా అనేదానిపై స్పష్టత లేదు.

అలాగే ఈ కంపెనీ వల్ల ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే అంశంపైనా క్లారిటీ లేదు. ఇక ప్రైవేటు కంపెనీపై కేంద్రం విపరీతమైన ప్రేమ చూపిస్తూ.. విశాఖ ఉక్కుపై మాత్రం పట్టించుకోవడంలేదు. తాము 3 బెర్తులతో పోర్టు నిర్మించుకుంటామని విశాఖ ఉక్కు పరిశ్రమ మూడో దశ విస్తరణపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా.. వాటిపై ఎన్డీఏ సర్కారు నోరు మెదపడంలేదు.

అలాగే ప్రస్తుతం ఏడాదికి 73 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 32 లక్షల టన్నులకు పెంచుకుంటామన్న ప్రతిపాదనలపైనా స్పందించలేదు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని వైసీపీ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన ప్రభుత్వ పెద్దలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...