Switch to English

నారాయణకు ఇలా.! అచ్చెన్నకు ఎందుకలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇద్దరూ మాజీ మంత్రులే.. ఒకరి విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఇంకొకరి విషయంలో లైట్ తీసుకున్నారా.? ఔనేమో.! ఆ ఇద్దరూ ఎవరో కాదు, మాజీ మంత్రి నారాయణ.. మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

అచ్చెన్నాయుడు, 2019 ఎన్నికల్లో గెలిచి, టీడీపీలో యాక్టివ్‌గానే వున్నారు. ఆయన మీద వైసీపీ సర్కారు ఈఎస్ఐ మెడికల్ స్కామ్ పేరుతో కక్ష కట్టిన మాట వాస్తవం. ఆ కేసులో ఆయన్ని అరెస్టు చేశారు.. అప్పటికే పైల్స్ సర్జరీ జరిగిన కారణంగా, అచ్చెన్నాయుడు.. అరెస్టు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో సొంత గ్రామం నుంచి అమరావతి వరకు రోడ్డు మార్గాన ప్రయాణించే క్రమంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

సరే, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా.. అన్న మాటనీ కాదనలేమనుకోండి.. అది వేరే వ్యవహారం. అచ్చెన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఆయన విషయంలో న్యాయ సహకారం విషయంలో చంద్రబాబు తగు రీతిలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. అచ్చెన్నకు బెయిల్ రావడం చాలా కష్టమయ్యింది.

కానీ, నారాయణ విషయంలో పరిస్థితి వేరు. హైద్రాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నారాయణను ఏపీ పోలీసులు చిత్తూరుకి తరలించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్తే, ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చేదాకా మొత్తం పరిస్థితిని చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారట.. పార్టీకి చెందిన న్యాయ విభాగం సహకారంతో.

మళ్ళీ నారాయణను అమరావతి కేసులో అరెస్టు చేసే అవకాశముంది గనుక అప్రమత్తంగా వుండాలని పార్టీకి చెందిన న్యాయ విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట చంద్రబాబు. ఎందుకిలా.? నారాయణ అంటే చంద్రబాబుకి ఎందుకంత మమకారం.?

అమరావతి వ్యవహారాలన్నీ నారాయణే చూసుకున్నారు. చంద్రబాబుకి కుడి భుజంలా వ్యవహరించారు అప్పట్లో నారాయణ. ఒకవేళ నారాయణ అప్రూవర్‌గా మారిపోతే.? బహుశా ఈ ఆందోళనతోనే చంద్రబాబు, అచ్చెన్నకు ఇవ్వని సహకారం, ప్రాధాన్యత నారాయణకు ఇస్తున్నారనుకోవాలేమో.

నారాయణ నిజానికి, టీడీపీతో లేరు. 2019 ఎన్నికల తర్వాత ఏనాడూ టీడీపీ తరఫున ఆయన మాట్లాడింది లేదు. అయినా నారాయణ అంటే చంద్రబాబుకి ప్రత్యేకమైన ఇది.! ఆ ‘ఇది’ టీడీపీలో చాలామందికి అర్థం కానిది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...