ప్రైవేటు ఉద్యోగాలు వెతుక్కోమని ఓ ‘మతిలేని’ బులుగు జర్నలిస్టు సలహా ఇస్తే, నిరుద్యోగులకు ఎక్కడో కాలుతుంది మరి. చర్చ, వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ గురించి. ప్రతి ఏడాదీ 6,500 ఉద్యోగాల్ని కేవలం పోలీసు శాఖలో భర్తీ చేస్తామని గతంలో పలుమార్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అది నిజమేనని నమ్మారు కూడా. అధికారంలోకి వచ్చాక, పాత విషయం కదా.. మర్చిపోయినట్టున్నారు వైఎస్ జగన్.
అధికారంలోకి వచ్చాక కూడా పలు సార్లు అధికార పార్టీ నేతలు, పైగా మంత్రులు.. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.. లెక్క కూడా ఏడాదికి 6,500 పోస్టులనే చెప్పారు. కానీ, తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ చూస్తే, అందులో 500 పోస్టులు కూడా కనిపించలేదు.
ఇదే విషయమై వైసీపీ సొంత మీడియా ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ నిరుద్యోగా నిలదీశాడు. నిజానికి, ప్రభుత్వాన్ని నిలదీసే కాల్స్ ఏవీ ఆ చానల్ ద్వారా టెలికాస్ట్ అయ్యే ప్రసక్తి వుండదు. కానీ, ‘జగనన్న వీరాభిమానిని..’ అంటూ మొదలెట్టేసరికి యాక్సెస్ దొరికినట్లుంది. ‘యాక్చీ..’ అనే స్థాయిలో సదరు బులుగు జర్నలిస్టు.. (ఒకప్పుడు ఈయన పచ్చ జర్నలిస్టు.. ఛానల్ మారగానే.. రంగు మార్చేశాడీయన..) ఆ నిరుద్యోగికి ఉచిత సలహా ఇచ్చేశాడు.
‘450 ఉద్యోగాలు ప్రకటించి మమ్మల్ని అవమానపరిచారు.. ఇవ్వకపోయినా పెద్దగా బాధపడేవాళ్ళం కాదేమో..’ అంటూ సదరు నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తే, ‘అలా అనడం కరెక్టు కాదు.. అయినా, ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడటమేంటి, ప్రైవేటు ఉద్యోగం వెతుక్కోవాలిగానీ..’ అనేశాడు సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టు. అవును మరి, నిరుద్యోగులకి ఈయనగారు ఉచిత సలహా ఇస్తే తప్ప ఉపాధి వెతుక్కోవడం వారికి తెలియదు.
ఈయనలాగా భజన చేసి, సంపాదించడం చేతకావడంలేదు కాబట్టే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. పైగా, ఉద్యోగాలు ఇస్తాం.. అని చెప్పబట్టే.. దానికోసం రెండేళ్ళుగా కష్టపడి చదువుతున్నాననీ, శిక్షణ పొందుతున్నాననీ చెప్పుకున్న ఆ బాధితుడితో ఇలాగేనా మాట్లాడేది.? జర్నలిజం కాదిది.. ఇది ఇంకోటేదో.
58586 132840I really like your write-up. Its evident which you have a lot knowledge on this subject. Your points are well produced and relatable. Thanks for writing engaging and interesting material. 599612
142153 136365This is a terrific web site, could you be interested in doing an interview about just how you produced it? If so e-mail me! 862980
580752 249098Properly written articles like yours renews my faith in todays writers. Youve written info I can lastly agree on and use. Thank you for sharing. 259352