BiggBoss : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు ఏడు సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా ఏడో సీజన్ కి కొన్ని కారణాల వల్ల మంచి రేటింగ్ దక్కింది అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇక ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ ను కూడా తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఓటీటీ బిగ్ బాస్ ఒక సీజన్ వచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ కి నాగార్జున ఆసక్తి చూపడం లేదట. అందుకే కొత్త హోస్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయి.
పలువురు యంగ్ హీరోలను ఈ షో కోసం సంప్రదించారని తెలుస్తోంది. ఒకరు ఇద్దరు ఆసక్తి చూపిస్తూ ఉన్నా కూడా వారిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయమై కూడా నిర్వాహకులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఫిబ్రవరి వరకు హోస్ట్ ను ఎంపిక చేసి కొత్త సీజన్ ను సమ్మర్ లో ప్రారంభించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.