Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: ఎవరిది జర్నలిజం.? ఎవరిది బ్రోకరిజం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

మీడియా అండ లేనిదే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించే పరిస్థితి ప్రస్తుతం లేదన్నది నిర్వివాదాంశం. మీడియా నైతిక విలువలకు కట్టుబడి ప్రజా శ్రేయస్సు కోసం తనంతట తానుగా రాజకీయ పార్టీలకు మద్దతిస్తుందా.? మీడియాని బలవంతంగా లోబర్చుకుని, రాజకీయ పార్టీలు తమ ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారా.? రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి మీడియా, ప్రజా శ్రేయస్సుని పక్కన పెట్టి రాజకీయ కరపత్రికగా మారిపోతుందా.? అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి.

దేశంలో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా వున్నా, ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి.. మీడియా అత్యంత పతనావస్థలో వుందన్నది నిర్వివాదాంశం. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా మీడియా వ్యవహరించడం వేరు. ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. మిగతావారికి వ్యతిరేకంగా పనిచేయడం వేరు. ఏపీలో మీడియా చేస్తున్నది రెండో రకం. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.

అధికార వైసీపీకి చెందిన ఓ నేత, ‘బ్రోకరిజం’ అంటూ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజమే, ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియా చేస్తోన్నది జర్నలిజం కాదు.. బ్రోకరిజం.. అన్న వాదన ఈనాటిది కాదు. ‘పచ్చ మీడియా’ గురించి ఇలా ‘బ్రోకరిజం’ అంటోన్న అధికార పార్టీ, ‘బ్లూ మీడియా’ గురించి ఏం చెప్పగలుగుతుంది.?

‘అందులో తప్పు రాశారు అధ్యక్షా..’ అని తమ సొంత పత్రిక గురించే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అసెంబ్లీలో చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం మీడియా తీరు. టీడీపీ అనుకూల మీడియా మీద వైసీపీకి ఒళ్ళు మండి ‘జర్నలిజంని కాస్తా బ్రోకరిజం’ అనేసింది. అదే మాట, బ్లూ మీడియాని ఉద్దేశించి టీడీపీ అంటుండడం కూడా చాలాకాలంగా చూస్తూనే వున్నాం.

కొన్నాళ్ళ క్రితం ఓ రాజకీయ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత, ఓ పత్రికను ఉద్దేశించి ‘టాయిలెట్‌ పేపర్‌’ అనేశారు. అప్పట్లో అది పెను దుమారమే రేపింది. ఆ పెద్దమనిషి, ఆ పత్రికని ప్రసన్నం చేసుకుని, ఆ పత్రికలో తనను పొగడ్తలతో ముంచెత్తేలా వార్తలు రాయించుకున్నారనుకోండి.. అది వేరే సంగతి. పాత్రికేయ రంగంలో ఇప్పుడు విలువల గురించి మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదేమో. ఆ స్థాయిలో జర్నలిజంని భ్రష్టుపట్టించేశాయి రాజకీయ పార్టీలు.

ఇక్కడ రాజకీయ పార్టీల్ని కూడా గట్టిగా అనలేని పరిస్థితి. ఎందుకంటే, కొన్ని మీడియా సంస్థలు.. తాము బ్రోకరిజం చేయడానికే వున్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి కూడా. కొద్దోగొప్పో సోషల్‌ మీడియా, కొన్ని వెబ్‌సైట్లు (ఇందులోనూ పెంట చాలా ఎక్కువే వున్నా.. విలువలకు కట్టుబడి పనిచేసేవి కొన్నయినా వున్నాయని చెప్పకోవచ్చు) మాత్రం.. కొంతమేర ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాయి తప్ప.. దాదాపుగా తెలుగు మీడియా అంతా ఏనాడో భ్రష్టుపట్టిపోయింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...