Bhola Shankar: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటించి ‘భోళా శంకర్’ (Bhola Shankar) విడుదల (ఆగష్టు 11) సంబరానికి ఒకరోజే ఉంది. మెగాభిమానులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో చిత్ర యూనిట్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారిగా జీపీఎస్ ట్రాకింగ్ తో మెగాస్టార్ చిరంజీవి ముఖచిత్రం కనిపించేలా భారీ ర్యాలీని హైదరాబాద్ లో చేపట్టింది. నేడు (ఆగష్టు 10) ఈ ర్యాలీ నగరంలోని 600 కిలోమీటర్ల మేర జరుగనుంది.
ఇది ప్రచారం మాత్రమే కాదని.. మెగాస్టార్ చిరంజీవిపై తమకు ఉన్న అభిమానాన్ని.. ఆయన గొప్పతనాన్ని ఇలా చాటుకుంటున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్టు నుంచి ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వేలాదిగా చిరంజీవి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ర్యాలీ ప్రారంభించారు మేకర్స్. చిరంజీవితో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ఫొటోలు, వీడియోలు పంపాలని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ కోరింది.