Switch to English

సోనూ సూద్‌ ‘సాయం’పై నిస్సిగ్గు రాజకీయమేల.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినీ నటుడు సోనూ సూద్‌.. తెరపై విలన్‌ పాత్రల్లో కన్పించినా రియల్‌ లైఫ్‌లో హీరోయిజం చూపిస్తున్నాడు. హీరోయిజం అంటే, ఆపదలో వున్నవారిని ఆదుకోవడం.. సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి తనకు చేతనైనంత సాయం చేయడమని నిరూపిస్తున్నాడు సోనూ సూద్‌. ఈ క్రమంలో సోనూ సోద్‌ చాలా రాజకీయ విమర్శల్నీ ఎదుర్కొన్నాడు. అయితే, విమర్శించిన నోళ్ళే ఇప్పుడు ఆయన్ని అభినందిస్తున్నాయి.

మరోపక్క సోనూ సూద్‌ చేస్తున్న గొప్ప పనిని అభినందిస్తూ.. ఇతరుల్ని కించపర్చేందుకు ‘రాజకీయం’ షురూ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకి చెందిన ఓ పేద రైతు కుటుంబాన్ని సోనూ సూద్‌ ఆదుకున్న విషయం విదితమే. ఎద్దులు లేక, నాగలి లాగేందుకు ఇద్దరు అమ్మాయిలు కష్టపడుతోంటే.. ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూ సూద్‌, ఆ పేద రైతు ఇంటికి ట్రాక్టర్‌ని బహుమతిగా పంపించాడు. అంతే, రాజకీయం వెర్రితలలు వేయడం మొదలైంది. ఫలానా హీరో ఎందుకు చేయలేదు.? ఫలానా రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు.? అంటూ సోషల్‌ మీడియా వేదికగా రచ్చ తారాస్థాయికి చేరిపోయింది.

నిజమే.. ఈ విషయంలో తొలుత ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్నే. గత ప్రభుత్వం కావొచ్చు.. ప్రస్తుత ప్రభుత్వం కావొచ్చు.. రైతుల్ని ఉద్ధరించేస్తున్నామంటూ పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు.. న్యూస్‌ ఛానళ్ళలో అడ్వర్‌టైజ్‌మెంట్లు.. ఇచ్చుకుంటూ పబ్బం గడుపుతున్నాయి తప్ప.. సగటు రైతు ఆవేదన ప్రభుత్వాలకి పట్టడంలేదని ఈ ఘటన నిరూపించింది. అంబులెన్స్‌లకు కూడా రిబ్బన్‌ కటింగులు చేసే పబ్లిసిటీ గ్యాంగ్‌ రాజకీయాల్లో రాజ్యమేలుతున్నప్పుడు గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఇలా కాక ఇంకెలా వుంటాయి.?

ప్రచారం కోసం ట్రాక్టర్ల ర్యాలీ తీస్తారు తప్ప.. దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్న పేద రైతుని ఆదుకునేందుకు ‘నాయకులు’ ముందుకొచ్చారా.? నిజానికి, కరోనా వేళ అధికార పార్టీ నేతలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తే.. స్వచ్ఛంద సంస్థలే ముందుకొచ్చాయి.. ఆకలితో అలమటిస్తోన్న పేదల్ని తమకు తోచిన రీతిలో ఆదుకున్నాయి. రాజకీయంగా బలం లేకపోయినా జనసైనికులు ఎక్కడికక్కడ తమకు చేతైనంత మేర బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. సినీ ప్రముఖులు ప్రభుత్వాలకి తమకు తోచిన మేర విరాళాలు అందించాయి. మరి, అవన్నీ ఏమైపోతున్నట్లు.? ఈ ప్రశ్నకి సమాధానం అధికార పార్టీ పెద్దలే చెప్పాలి.

3 COMMENTS

  1. 983478 569645Can I just say what a relief to search out somebody who genuinely is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a problem to light and make it essential. Extra folks need to learn this and perceive this facet of the story. I cant consider youre no much more common because you positively have the gift. 392073

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...