Switch to English

బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ఈ అమ్మకాలేంటి మహాప్రభో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బిల్డ్‌ ఏపీ.. అంటే ఏంటి.? ఆంధ్రప్రదేశ్‌ని నిర్మించడమని అర్థం.! కానీ, ఆ బిల్డ్‌ ఏపీలో భాగంగా భూముల్ని అమ్మేయాలనుకోవడమేంటి.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సింగపూర్‌ కన్సార్టియం కోసం గత చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన భూముల్లోంచి 1600 ఎకరాల భూమిని అమ్మేయాలనే ఆలోచనతో వున్నట్లు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టుకి తెలపడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ప్రభుత్వాలు భూముల్ని అమ్మడమో, లీజుకి ఇవ్వడమో కొత్తేమీ కాదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అభివృద్ధి ముసుగులో ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న అన్యాయమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఆయా సంస్థలకు భూముల్ని కట్టబెడితే, ‘అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.. అడ్డగోలుగా బలిసిపోయారు..’ అంటూ వైసీపీ ఆరోపించింది. ఆరోపించడమే కాదు, తాము అధికారంలోకి వచ్చాక, ఆయా అంశాలపై విచారణ షురూ చేసింది కూడా.

చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ సహా చాలామంది టీడీపీ నేతల మీద ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ‘దొంగలు’ అన్న ముద్ర వేస్తోన్న విషయం విదితమే. మరి, ఇప్పుడు ఈ ‘బిల్డ్‌ ఏపీ’ కింద అమ్మకాలు జరిపితే, రేప్పొద్దున్న కొత్త ప్రభుత్వం మళ్ళీ విచారణల పేరుతో ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై ‘దొంగ’ అన్న ముద్రలేసి, జైలుకు పంపకుండా వుంటుందా.? ఇదేనా రాజకీయం.? ఆంధ్రప్రదేశ్‌లో ఈ పైత్యం ఇంకెన్నాళ్ళు.? అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. రాజధాని ఎక్కడ.? అన్న సందేహం ఇంకా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని వీడటంలేదు.

పోలవరం ప్రాజెక్టు ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదన్న వాదనలున్నాయి. ఇవేవీ ప్రభుత్వ పెద్దలకు పట్టడంలేదా.? భూములు అమ్ముకోవడం తప్ప ప్రభుత్వానికి వేరే పనేమీ లేదా.? అన్న విమర్శలు వివిధ పక్షాల నుంచి విన్పిస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం నెత్తిన అప్పుల కుంపటి పెట్టారన్నది వైసీపీ ఆరోపణ. మరి, వైసీపీ చేస్తున్నదేంటి.? ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోకపోతే.. నష్టపోయేది ప్రజలకే. అయినా, రాజధాని కోసం రైతులు స్వచ్చందంగా భూములిస్తే.. రాజధానిని నిర్మించాల్సింది పోయి.. ఆ భూముల్ని ప్రభుత్వం అమ్మేస్తామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...