Switch to English

ఏపీలో ఫ్యాన్ స్పీడ్.. కేంద్రంలో కమలం జోరు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అందరూ ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. అక్కడ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా తిరుగుతోంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి ఏకంగా 150 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 24 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉండగా.. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక్క స్థానంలో మాత్రమే లీడ్ లో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ తోనే వైఎస్సార్ సీపీ హవా మొదలైంది. అనంతరం మొదలైన ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ తిరుగులేని ఆధిక్యతలో దూసుకెళ్తోంది. మంగళగిరిలో నారా లోకేశ్ వెనకంజలో ఉన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఆ పార్టీకి దాదాపు 10 శాతం ఓట్లు పోలైనట్టు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసిన గాజువాక, భీమవరం రెండు చోట్లా వెనకబడే ఉన్నారు. భీమవరంలో మూడో స్థానంలో ఉండగా.. గాజువాకలో ఓ సారి ముందంజలోకి వచ్చి మళ్లీ వెనకబడ్డారు. ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాత్రం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పార్లమెంటు స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఆ పార్టీ ఏకంగా 23 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. టీడీపీ రెండు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.

ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ జగన్ చేసిన అభ్యర్థనను ప్రజలు అంగీకరించినట్టుగా ఈ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటు కానుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైన మేరకే ఎన్డీఏకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏకంగా 335 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. యూపీఏ కూటమి 90 స్థానాలకే పరిమితమైంది. బిహార్ లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయడం విశేషం. అలాగే యూపీలో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.

మరోవైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ జోరు కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ బీజేపీ బాగానే పుంజుకుంది. మొత్తం 17 స్థానాలకు గానూ 8 స్థానాల్లో టీఆర్ఎస్, 4 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎంఐఎం ఆధిక్యంలో ఉన్నాయి. కారు.. సారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో బరిలోకి దిగిన టీఆర్ఎస్ కు ఇది ఒకవిధంగా ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. కాంగ్రెస్ కంటే బీజేపీ ఇక్కడ బలం పుంజుకోవడం విశేషం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

రాజకీయం

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...