Switch to English

ఎన్నికల ఫలితాలు: చంద్రబాబు రాజీనామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చంద్రబాబు రాజీనామా

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖని గవర్నర్ నరసింహన్ కు పంపారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న దరిమిలా, అప్పటి వరకూ చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయి. తాజా ఎన్నికల్లో చంద్రబాబుకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెల్సిందే.

హిందూపురంలో మళ్ళీ గెలిచిన బాలయ్య

సినీ నటుడు, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ ఇంకోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ని తట్టుకుని బాలయ్య విజయం సాధించడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వుందన్న ముందస్తు అంచనాలేవీ బాలయ్య విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.

భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమి

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మరో నియోజకవర్గం గాజువాకలోనూ వైసీపీ అభ్యర్థి కంటే పవన్ వెనుకబడి వున్నారు. అక్కడా ఆయన ఓటమి దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ఓడిపోయారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి వరుసగా నాలుగోసారి ఆయన ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకుని మంత్రి అయిన సోమిరెడ్డి, ఇటీవల ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగినా మరోసారి ఆయనకు ఓటమి తప్పలేదు.

4 లక్షలకు పైగా మెజార్టీతో నరేంద్ర మోడీ గెలుపు

ప్రధాని నరేంద్రమోడీ వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి 4 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప అభ్యర్థి షాలిని యాదవ్ పై ఆయన అద్భుత విజయాన్ని అందుకున్నారు.

కుప్పంలో చంద్రబాబు గెలిచారండోయ్..

చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని నిండా ముంచేసిన చంద్రబాబు, తాను గెలిచినా జనానికి మొహం చాటేయాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకున్నారు.

ఓడిపోయిన ప్రకాష్ రాజ్

కర్నాటక రాజధాని బెంగళూరులోని సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్, కొన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టడంలో సఫలమయినా, అంతిమంగా ఆయన్ను ఓటమి వరించింది. సినీ నటుడిగా, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ.. ఇలా చాలా భాషల్లో నటించిన ప్రకాష్ రాజ్, నటన ద్వారా తాను సాధించిన పాపులారిటీ తనను గెలిపిస్తుందనుకున్నారుగానీ, ఆయన పప్పులుడకలేదు.

మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రపదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 30న పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రబాబు రాజకీయాల్లో వాడకూడని భాష ఉపయోగించారనీ, అందుకే ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఉమ్మారెడ్డి అన్నారు.

ఓటమి బాటలో కేసీఆర్ కుమార్తె కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యేలా వున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ తనయుడే అర్వింద్. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన డీఎస్, కొన్ని కారణాలతో పార్టీకి దూరంగా వుంటున్నారు.

నగిరిలో మళ్ళీ రోజా గుభాళింపు

సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, ఇంకోసారి నగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించబోతున్నారు. ఈ నియోజకవర్గంలో ఈసారి రోజా గెలుపు కష్టమేనని పలు సర్వేలు అంచనా వేశాయి. అయితే, నియోజకవర్గంలో రోజా చేసిన పలు మంచి కార్యక్రమాలకు ఆకర్షితులైన ఓటర్లు ఆమె వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. తన ప్రత్యర్థి, టీడీపీ నేత గాలి భానుప్రకాష్ పై భారీ ఆధిక్యాన్ని ప్రతి రౌండ్ లోనూ ప్రదర్శిస్తున్నారు రోజా. టీడీపీలో గ్రూపు తగాదాలు రోజాకి బాగా కలిసొచ్చాయి. రోజా గెలిచి, మంత్రి అవుతారంటూ గత కొంతకాలంగా వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే

నారా లోకేష్ పరిస్థితి ఏంటట?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారి పుత్ర రత్నం నారా లోకేష్, మంగళగిరి నియోజకవర్గంలో పరాజయం చవిచూడడం దాదాపు ఖాయమైపోయింది. అద్భుతం ఏదన్నా జరిగితే తప్ప, ఆయన గెలిచే అవకాశాల్లేవు. ఐదు రౌండ్లు ముగిసే సరికి దాదాపు 9 వేల ఓట్ల తేడాతో వెనకబడిపోయారు నారా లోకేష్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఖాయమని టీడీపీ శ్రేణులు ఫిక్స్ అయిపోయాయి. నానా రకాల లెక్కలూ వేసుకుని, లోకేష్ ఈ నియోజకవర్గంపై కన్నేసినా ప్రయోజనం లేకుండాపోయినట్లే కనిపిస్తోంది.

మిన్నంటుతున్న వైసీపీ శ్రేణుల సంబరాలు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఆంధ్రపదేశ్ లో దాదాపు ఖాయమైపోయింది. ప్రస్తుత ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే, వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లే కన్పిస్తోంది. దాంతో, వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. మొదటి రౌండ్ నుంచే అభిమానులు, కార్యకర్తలు రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు తీశారు. తమ తమ అభ్యర్థులు గెలిచేసినట్లుగా ఫ్లెక్సీలు ముందే సిద్ధం చేసుకుని, వాటిని ప్రదర్శిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఇళ్ళల్లోంచి బయటకు రావడానికి కూడా సంకోచిస్తున్న పరిప్థితి దాదాపు అన్ని చోట్లా కనిపిస్తోంది.

భీమవరంలో మూడో స్థానంలో పవన్

రాజకీయాల్లో మార్పు మొదలైందంటూ ఎన్నికల కౌంటింగ్ కి కొద్ది రోజుల ముందు పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ పరాజయం చవిచూసేలా వున్నారు. మొదటినుంచీ ఈ నియోజకవర్గంలో పవన్ గెలుపు కష్టమేనని అంతా భావించారు. కానీ, తన గెలుపుపై పవన్ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ పవన్ మాట చెల్లేలా కనిపించడంలేదు. మూడో రౌండ్ ముగిసే సమయానికి పవన్ మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. మొదటి స్థానంలో వైసీపీ, రెండో స్థానంలో టీడీపీ నిలిచాయిక్కడ. పవన్ పరిస్థితి ఇలా వుంటే, ఆయన సోదరుడు నాగబాబు కూడా అస్సలేమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో.

బాలయ్య గట్టెక్కేసినట్లేనా?

నందమూరి బాలక్రిష్ణ, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థితో పోల్చితే బాలయ్య ఓ మోస్తరు ఆధిక్యం ప్రతి రౌండ్ లోనూ ప్రదర్శిస్తున్నారు. ఈ ఆధిక్యం ఇలా కొనసాగితే, బాలయ్య విజయం సాధించడం దాదాపు ఖాయమైపోయినట్లే. అయితే ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా బాలయ్యకు ఓటేసినవారు కూడా, ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి వైసీపీని ఎంచుకున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి.

మొత్తానికి ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగడంతో ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ? అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఫ్యాన్ గాలి స్పీడ్ కు సైకిల్ వేగం తగ్గింది. దాదాపు 134 స్థానాలో వై సిపి ముందంజలో ఉంటె టిడిపి కేవలం 34 స్థానాల్లో ముందంజలో సాగుతున్నాయి. ఈ ఫలితాలను బట్టి చుస్తే సైకిల్ కి నిరాశ తప్పేలా లేదు. ఇక నియోజకవర్గాల వారీగా చుస్తే పలువురు ప్రముఖులు ముందంజలో ఉన్నారు. ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న మరో అంశం నందమూరి బాలకృష్ణ గురించి. హిందూపురం అసెంబ్లీ స్తానం నుండి రెండో సారి పోటీ చేస్తున్న బాలయ్య గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు టిడిపి శ్రేణులు. కానీ అక్కడ చుస్తే ఫ్యాన్ గాలి జోరు అంతకంతకు పెరగడంతో ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.

ఇక సెంటిమెంట్స్ ను ఎక్కువగా నమ్మే బాలయ్య గత ఎన్నికల్లో అయన కౌంటింగ్ సమయంలో ఆర్టీడి స్టేడియంలో బస చేసారు. అప్పట్లో రూమ్ నెంబర్ 9 ని కేటాయించగా .. ఇప్పుడు అదే రూమ్ ని ఆయనకు కేటాయించడం విశేషం. బాలయ్య లక్కీ నంబర్ 9 కాబట్టి మళ్ళీ పాత రికార్డ్ రిపీట్ అవుతుందని టిడిపి శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటు బాలయ్య కూడా పాత సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని మంచి జోరుమీద ఉన్నాడట. 2014 లో హిందూపురంలో బంపర్ మెజార్టీ సాధించిన బాలయ్య ఈ సారి కూడా అలాంటి మెజారిటీ సాధిస్తాడా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. అటు బాలయ్య అల్లుడు, చంద్రబాబు తనయుడు లోకేష్ ఇప్పటికే ఆధిక్యంలో ఉన్నాడు.

ప్రకాష్ రాజ్ కు నిరాశ తప్పదా ?

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈ ఎన్నికల్లో నిరాశ తప్పేలా లేదు ? ఈ ఎన్నికల్లో అయన బెంగుళూరు సెంట్రల్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ కు ఇప్పట్టి వరకు వెల్లడైన ఫలితాల్లో వెనకంజలో ఉన్నారు. ఎన్నికలకు ముందు అయన ఓ ప్రధాన పార్టీ తరపున రంగంలోకి దిగుతారని అనుకున్నారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోకి దిగడంతో పాటు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.అయితే ఇప్పటి వరకు ఆయనకు ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం రాలేదు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు చేస్తుంటే బిజెపి ముందంజలో ఉంది. ఇక తెలంగాణాలో కారు జోరుమీద ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సైకిల్ జోరు తగ్గింది. వైఎస్ ఆర్ సిపి ఫ్యాన్ జోరుగా తిరుగుతుంది. మరోవైపు సినీ నటి సుమలత ముందంజలో ఉండగా.. నటి జయప్రద మాత్రా వెనుకంజలో నిలిచింది. మరి ఇంకొన్ని గంటల్లో వెలువడే ఫలితాల్లో ఎవరెలాంటి విజయం అందుకుంటారో చూడాలి.

చిత్తూరు జిల్లా కుప్పం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కంచుకోట. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు తొలిసారిగా ఓటమిపాలవనున్నారా? అంటే ఎర్లీ ట్రెండ్స్‌ చూస్తే అలాగే అన్పిస్తోంది. ఉదయం 9.30 నిమిషాల సమయానికి చంద్రబాబు వెనుకంజలో వుండగా, వైసీపీ అభ్యర్థి మాత్రం 67 ఓట్లతో ముందంజలో నిలవడం గమనార్హం. కుప్పంలో రికార్డు మెజార్టీ కొల్లగొడ్తామని తెలుగుదేశం పార్టీ చెబుతూ వచ్చింది. కుప్పంలో గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని వైఎస్‌ జగన్‌, ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణుల్ని ఉత్సాహ పరిచారు. గెలవకపోయినా, గట్టి పోటీ ఇస్తే చాలు పార్టీలో, ప్రభుత్వంలో మంచి అవకాశమిస్తానని వైసీపీ అధినేత భరోసా ఇచ్చిన విషయం విదితమే. ఆ ఎఫెక్ట్‌ గట్టిగానే పనిచేసినట్లుంది. 67 ఓట్ల ఆధిక్యం అంటే పెద్ద విషయమేమీ కాకపోయినా, ముఖ్యమంత్రి పోటీ చేసిన నియోజకవర్గంలో ముఖ్యమంత్రిని అధిగమించడం చిన్న విషయం అయితే కాదు.

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైఎస్సార్సీపీ హవా స్పష్టంగా కన్పిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో వైసీపీ హవా చూసి, టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది. టీడీపీ నేతలు మీడియా చర్చల్లో ఆల్రెడీ తెల్లమొహాలు వేసేశారు. అసెంబ్లీ, పార్లమెంటు సిగ్మెంట్లలో ఎక్కడా వైసీపికి గట్టి పోటీ అయినా ఇచ్చేలా కన్పించడంలేదు టీడీపీ. జనసేన పరిస్థితి మరీ దారుణం. భీమవరంతోపాటు, గాజువాకలోనూ జనసేనాని పవన్‌కళ్యాణ్‌ వెనుకంజలోకి వెళ్ళిపోయారు. అయితే, గాజువాకలోనూ భీమవరంలోనూ పవన్‌కళ్యాణ్‌ పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. రెండు చోట్ల ప్రస్తుతానికి జనసేన ఆధిక్యంలో కన్పిస్తోంది. జనసేన ముమ్మిడివరం అభ్యర్థి పితాని బాలకృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాజువాకలో పవన్‌ ఆధిక్యంలోకి వచ్చి, మళ్ళీ వెనుకంజ వేశారు.

ఎన్నికల కౌంటింగ్‌ షురూ అయ్యింది.. మరికొద్ది గంటల్లో జాతకాలు తేలిపోనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, గంటలోపే ఎర్లీ ట్రెండ్స్‌ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. 9 గంటల సమయానికి వున్న పరిస్థితిని చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా గట్టిగానే కన్పిస్తోందనిపిస్తుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో వున్నారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో కనిపిస్తున్నారు.

ఇప్పటివరకూ జనసేన పార్టీ తాలూకు ఉనికి ఎక్కడా కన్పించడంలేదు. పోటీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్యనే వున్నట్లుగా ప్రాథమిక ట్రెండ్‌ని బట్టి అర్థమవుతోంది. అయితే, రౌండ్‌ రౌండ్‌కీ మారిపోయే ఫలితాల నేపథ్యంలో ఇప్పుడే ఎలాంటి ఖచ్చితమైన నిర్ణయానికీ వచ్చేయలేం. కాగా, పులివెందులలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ముందంజలో వుంటే, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌ ముందంజలో కనిపిస్తున్నారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ నేత భరత్‌ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. అరకులో వైసీపీ అభ్యర్థికి ఆధిక్యం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు వెనుకంజలో వుంటే, విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీకి ఆధిక్యం కనిపిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ పరంగా చూస్తే, దాదాపుగా వైసీపీదే పై చేయి అని తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. ఓ చోట కాంగ్రెస్‌, మరో చోట బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. మజ్లిస్‌ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యం కొనసాగిస్తోంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మళ్ళీ మరోమారు ఓటర్లు పట్టం కట్టినట్లు ప్రాథమిక ట్రెండ్స్‌ని బట్టి అర్థమవుతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...