ఏపీ క్యాబినెట్ పునర్వవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా..? అంటే అవుననే అంటున్నారు. ఏప్రిల్ 7న క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ఇదే ప్రస్తుత మంత్రిమండలి సమావేశం అంటున్నారు. ఈ సమావేశంలోనే ప్రస్తుత మంత్రుల్లో కొనసాగేదెవరు.. కొత్త వారెవరు అనే విషయాలపై సీఎం క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
ఆ మరుసటి రోజు (ఏప్రిల్ 8) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా కోరారని తెలుస్తోంది. అదే రోజున రాజీనామా చేసిన మంత్రుల జాబితా.. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న వారి జాబితాను గవర్నర్ కు అందజేస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే ఏప్రిల్ 11న మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని సమాచారం అందుతోంది.
ఈక్రమంలో ఏప్రిల్ 7న జరుగబోయే క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఎజెండా సిద్ధం చేయాలని ప్రభుత్వ శాఖాధిపతులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. నేడో, రేపో దీనిపై సీఎస్ అధికారిక సమాచారం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త మంత్రిమండలిపై సీఎం జగన్ గతంలో స్వయంగా వెల్లడించిన నేపధ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
283002 349632Superb read, I just passed this onto a colleague who was doing just a little research on that. And he really bought me lunch because I located it for him smile So let me rephrase that. 124703
57039 335850Read more on that great Post, I linked to you Thanks. 445903
815212 949084dog grooming will be the specialty of my sister, she truly loves grooming every dog in our house 47585
246541 393512Great weblog, Im going to spend more time reading about this subject 806721