చట్ట సభలెందుకు వున్నాయ్.? ప్రభుత్వ పెద్దల భజన కోసమా.? అన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు అధికార పార్టీ శాసన సభ్యులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారంతే. చట్ట సభల్లో చర్చ జరగాల్సింది ప్రజా శ్రేయస్సు కోసం.
తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యల్ని ప్రజా ప్రతినిథులు చట్ట సభల్లో ఏకరువు పెట్టాలి. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు, ఆ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి. ఇదీ చట్ట సభల్లో జరగాల్సింది. కానీ, చట్ట సభల నిర్వహణ అంటే ప్రభుత్వాన్ని నడిపేవారిని కీర్తించడం కోసం ఉద్దేశించిన ప్రైవేటు కార్యక్రమంగా మారిపోయింది.
శాసనసభ, శాసన మండలి, లోక్ సభ, రాజ్య సభ.. ఇలా ఎక్కడైనా దాదాపుగా ఒకటే తంతు. కాస్త ఎక్కువ, కాస్త తక్కువ.! అంతే తేడా.! భజన మాత్రం మామూలే.
ఆంధ్రప్రదేశ్ ఈ భజన కవితల స్థాయిని కూడా దాటేసింది. భజన తారాస్థాయికి చేరిపోయింది. జంగారెడ్డిగూడెంలో నాటు సారా దెబ్బకి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే, స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించి వచ్చారు. చట్ట సభల్లో మాత్రం, ‘అబ్బే, అవన్నీ సహజ మరణాలే..’ అని సెలవిస్తున్నారు.
ఏ చట్ట సభలైతే వున్నాయో, ఆ ప్రాంతాన్ని అధికార పార్టీ శాసన సభ్యులే ఎడారి, స్మశానం.. అని అభివర్ణిస్తున్నారు. అక్కడే, ఆ చట్ట సభల్లోనే ముఖ్యమంత్రిని కీర్తిస్తున్నారు. దీన్ని ఏ తరహా రాజకీయం అనాలో అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు రాష్ట్ర ప్రజలు.
‘మన రాష్ట్ర రాజధాని ఏది అధ్యక్షా.?’ అని అడిగే ప్రజా ప్రతినిథి లేడు, ఒకవేళ ఎవరన్నా అడిగితే, దానికి శాసనసభ సాక్షిగా ప్రభుత్వం సమాధానమిచ్చే పరిస్థితి లేదు. కుప్పలు తెప్పలుగా అప్పులు జరుగుతున్నాయి. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నిండా మునిగిపోయింది. అయినా, ముఖ్యమంత్రి భజనలో మాత్రం అధికార పార్టీ శాసనసభ్యులు అస్సలు తగ్గట్లేదు.
అప్పుకీ ఆదాయానికీ తెలియనంత దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కొట్టుమిట్టాడుతున్నారని అనుకోవాలేమో.! అప్పు దెబ్బకి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతోంది.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టబడుతోంది.! అయినా ఫరక్ పడదు.! భజన చెయ్యండహో.! పదవులు పొందండహో.!
795904 198601very good post. Neer knew this, thankyou for letting me know. 871499
465307 296020so much wonderful info on here, : D. 820963
Great looking web site. Assume you did a lot of your very own coding. [url=https://dnaskin.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=132108]Anzeichen für den Verkauf von monuril in Österreich[/url]
220258 443161I see something genuinely unique in this internet website . 800045