Switch to English

Annapurna Photo Studio: “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సెకండ్ సాంగ్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Annapurna Photo Studio: టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న సినిమా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో”. ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును అనేది ఉపశీర్షిక. పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో.

30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో విడుదలైన మోషన్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్ చేతుల మీదుగా విడుదల చేశారు..

ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్ మాట్లాడుతూ.. ‘ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఆల్బమ్ లోని సెకండ్ సాంగ్ ను నేను విడుదల చేశాను. మామూలుగా ఫార్మల్ గా బావుందని చెబుతారు. కానీ ఈ పాట నిజంగా చాలా బావుంది. మళ్లీ మళ్లీ వినాలని ఉంది. సినిమాకు మంచి వైబ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ అద్భుతమైన సౌండింగ్ చేశారు. పాటలో మంచి క్వాలిటీ కనిపిస్తోంది. నేను కొన్ని విజువల్స్ చూశాను. యాక్టింగ్ పరంగా చైతన్య, లావణ్య ఇరగదీశారు అన్నారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ” తరుణ్‌ భాస్కర్ గారు మా పాటను విడుదల చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో వెన్నెల్లో ఆడపిల్ల అనే ఈ సెకండ్ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఫస్ట్ సాంగ్ రంగమ్మ చాలా వైరల్ అయింది. ఈ సెకండ్ సాంగ్ అంతకంటే ఎక్కువ వైరల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తరుణ్‌ భాస్కర్ గారు నాకు సైన్మ అనే షార్ట్ ఫిల్మ్ తీసినప్పటి నుంచీ తెలుసు. అప్పటి నుంచే ఆయనతో పనిచేయాలనుకుంటున్నాను. ఫైనల్ గా ఈ రకంగా తరుణ్ తో అసోసియేట్ అయ్యే అవకాశం వచ్చింది. ఫస్ట్ సాంగ్ పాడిన ఎస్పీ చరణ్‌ గారే ఈ పాటనూ పాడారు. నా సినిమాలో ఆయన పాడటం చాలా సంతోషంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ ఫస్ట్ సాంగ్ రెట్రో స్టైల్ లో కంపోజ్ చేశారు. ఈ పాట కూడా బ్యూటీఫుల్ గా ఉంది. వినగానే సోల్ ఫుల్ గా అనిపిస్తోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు చెందుముద్దు గారికి ధన్యవాదాలు. బిగ్ బెన్ బ్యానర్ ద్వారా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి కొత్త టాలెంట్ కు ఇంత మంచి అవకాశం ఇచ్చిన యశ్ రంగినేని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. చివరగా మా పాటను విడుదల చేసిన తరుణ్ భాస్కర్ గారికి మరో సారి థ్యాంక్యూ. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తోన్న మా అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ముందుగా మా పాటను విడుదల చేసిన తరుణ్‌ భాస్కర్ గారికి థ్యాంక్యూ. నేను తరుణ్‌ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. మొదట వచ్చిన రంగమ్మ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ ఆ పాటకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రెండో పాటగా వెన్నెల్లో ఆడపిల్ల వస్తోంది. మొదటి పాట రంగమ్మ ఎంత నచ్చిందో.. ఈ వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ కూడా మీకు అంతే నచ్చుతుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ గారు. అలాగే శ్రీనివాస్ గారు రంగమ్మ సాంగ్ లాగానే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ విజువల్స్ మీకు బాగా నచ్చుతాయి. నా కో యాక్టర్స్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు చెందు ముద్దుగారికి చాలా థ్యాంక్స్. మేమంతా కొత్తవాళ్లమైనా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన నిర్మాత యశ్ రంగినేనిగారికి ధన్యవాదాలు.. ” అన్నారు.

గీత రచయిత శ్రీనివాస్ మౌళి మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాలో మూడు పాటలు రాశాను. మొదటి పాట రంగమ్మా చాలా పెద్ద హిట్ అయింది. ఈ పాటకోసం దర్శకుడు చెందు గారు సీన్ చెప్పడంతో పాటు కొన్ని విజువల్స్ కూడా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. రెండు రాత్రులు కష్టపడి ఈ పాటను రాశాం. నాకు ఎంతో ఇష్టమైన ఎస్పీ చరణ్‌ గారితో పాటు రజిత బాగా పాడారు. నేను రాసిన మెలోడియస్ సాంగ్స్ అన్నీ హిట్అయ్యాయి. అలాగే ఈ పాట కూడా పెద్ద హిట్ అవుతుందీ అనుకుంటున్నాను. మా ఈ ఎఫర్ట్ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని కోరుకుంటూ.. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...