తెలుగు భామ అంజలి .. పెళ్లి పేరెత్తితే చాలు ఉలిక్కి పడుతుంది. ఈ మధ్య ఈమె పెళ్లి చేసుకుంటుందంటూ కోలీవుడ్ లో వార్తలు జోరందుకున్నాయి. ఈ విషయం తెలిసిన అంజలి మీడియా పై ఫైర్ అవుతుంది. పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు ? అంతే కాదు పైగా పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బాయ్ చెబుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. నేను ఎవరికైనా చెప్పానా .. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉందని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పను. అంటూ గట్టిగానే చెప్పింది.
దాంతో పాటు గ్లామర్ పాత్రలకు సిద్దమే అంటూ హింట్ కూడా ఇచ్చింది !! సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న అంజలి ఆ సినిమాతో తన కెరీర్ ఇక్కడే జోరుగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది .. కానీ ఆ సినిమా తరువాత రెండు మూడు సినిమాల్లో నటించిన అంజలికి వరుస పరాజయాలు క్యూ కట్టాయి.
దాంతో ఇక్కడ లాభం లేదని మళ్ళీ కోలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. చిత్రాంగద అంటూ హార్రర్ ని నమ్ముకున్నా లాభం లేకపోయింది. ప్రసుత్తం లిసా, నానోడిగళ్ 2 అనే సినిమాల్లో నటిస్తుంది. గత కొన్నీ రోజులుగా హీరో జై తో ఘాటు ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు ప్రస్తుతం అతగాడితో విడిపోయిందట. అందుకే ప్రేమ, పెళ్లి అంటే చిర్రుబుర్రు లాడుతున్నట్టుంది.
657876 139614This really is a good blog i should say, normally i don????t post comments on other people???? blogs but would like to say that this post genuinely forced me to do so! 31290
48535 424965There is noticeably a bundle to realize about this. I assume you created various good points in features also. 711974
444032 117966Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 246290