Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal) మూవీ సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ముంబైలో ప్రేక్షకుల తాకిడికి షోస్ కూడా ప్రదర్శిస్తున్నారు. త్రిష, రేణు దేశాయ్ వంటి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సినిమాపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీరి సరసన ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా చేరారు. సహజంగా రచయిత, దర్శకుడైన హరీశ్ తనదైన శైలిలో సినిమాను, దర్శకుడు సందీప్ రెడ్డిని ఉద్దేశించి పోస్ట్ చేశారు.
‘పేరులోనే “వంగా” అని ఉన్నప్పుడు.. అతడు విమర్శలకు, విశ్లేషణలకు వంగుతాడనుకోవడం అమాయకత్వం. సినిమాకు రూల్స్ ఏం ఉండవని కొందరంటారు. కానీ.. ఇతని బ్రేక్ చేసి చూపించాడు. సినిమా చూసినవాళ్లు.. నచ్చినవాళ్లు బావుంది అనడం లేదు.. బద్దలైపోయింది అంటున్నారు. ఇంత సుదీర్ఘంగా రాసిన తర్వాత నేను సినిమా బాలేదంటే.. బాగోదేమో’ అని సుదీర్ఘ అభిప్రాయం రాసుకొచ్చారు. హరీశ్ శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.
Dear Sandeep @imvangasandeep
My take on ANIMAL…. #AnimalMovie pic.twitter.com/Ch8yqlrt0E— Harish Shankar .S (@harish2you) December 6, 2023