పోలీస్ ఉన్నతాధికారులు విపక్షాలపై ఘాటైన విమర్శలు చేయొచ్చా.? రాజకీయాలు మాట్లాడొచ్చా.? అన్న అంశం చుట్టూ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ఖాకీ డ్రెస్సు తీసేసి, వైసీపీ జెండా రంగులున్న యూనిఫాం ధరించండి..’ అంటూ టీడీపీ నేతలు, ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకు ఉచిత సలహాలిచ్చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.
దాదాపు ఇదే విమర్శ, చంద్రబాబు హయాంలో వైసీపీ నుంచి వచ్చింది.. ‘ఖాకీ యూనిఫాం తీసేసి, పసుపు చొక్కాలు వేసుకోండి..’ అని. ఎందుకిలా.? పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకులు.. పార్టీల దృష్టిలో ఎందుకిలా పలచనైపోయింది.? అంటే, దానికి బోల్డన్ని కారణాలు. విజయవాడలో వున్న ఓ ఇంటి అడ్రస్ పెట్టి, కనీ వినీ ఎరుగని స్థాయిలో హెరాయిన్ స్మగ్లింగ్ యత్నం జరిగింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంవమయ్యిందీ వ్యవహారం.
చెన్నయ్ కేంద్రంగా డ్రగ్స్ కార్యకలాపాలు జరిగాయని విచారణలో తేలింది. అయితే, సదరు వ్యవహారానికి సంబంధించి ఏపీలోని విజయవాడ అడ్రస్ ఎందుకు నిందితులు వాడారు.? అన్నది కీలకమైన అంశమే కదా. విజయవాడ అంటే, ఆ పక్కనే తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వుంటున్నారు. రాజకీయ విమర్శల్లో భాగంగా, ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో.. అనడం పరిపాటే.
మొన్నామధ్యన, నిజంగానే.. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఓ యువతిపై కృష్ణా నది ఒడ్డున దారుణమైన రీతిలో అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ విమర్శలొస్తాయ్.. విపక్షాలు రాజకీయాలు చేయడం తగదంటూ సాక్షాత్తూ డీజీపీ మీడియా ముందుకొచ్చి చెప్పడం అత్యంత దురదృష్టకరమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
సరే, ఆ డ్రగ్స్ వ్యవహారానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ సంబంధం వుండి వుండకపోవచ్చు. కానీ, రాష్ట్రంలో జరుగుతున్న చాలా ఘటనలకు సంబంధించి పోలీసు శాఖ వైపు అందరూ వేలెత్తి చూపే పరిస్థితులు ఎందుకొస్తున్నాయ్.? అని పోలీస్ వ్యవస్థ తనను తాను ప్రశ్నించుకోవాల్సి వుంటుంది. సోషల్ మీడియా పోస్టింగుల మీద కేసులు పెట్టడంలో చూపే శ్రద్ధ, ప్రజలకు భద్రత కల్పించడంలో పెడితే బావుంటుందన్న విమర్శ విపక్షాల నుంచి రావడం సహజమే.
452924 10880I like this internet web site because so a lot utile stuff on here : D. 423278
948176 717337Im often to blogging and i in actual fact respect your content material. The piece has truly peaks my interest. Im going to bookmark your content material and preserve checking for brand new information. 184083
89879 538893Informative Site Hello guys here are some links that contains information that you could uncover helpful yourselves. It is Worth Checking out. 122066
824786 130705Respect to author , some excellent data . 688410
702567 431175Hi there, i just thought i would publish and now let you know your websites style is truly smudged within the K-Melon browser. Anyhow preserve within the very excellent function. 1568