Switch to English

బీజేపీకి అమరావతి ‘చెప్పుదెబ్బ’.. ఇప్పుడే ఎందుకు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అసహనం పెరిగిపోయింది.. అమరావతి పేరుతో బీజేపీ నేతని చెప్పుతో కొట్టాడు ఒకాయన.. అదీ ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో. అందునా, ఓ ప్రముఖ జర్నలిస్టు సమక్షంలో.. అది కూడా టీడీపీ అనుకూల మీడియాలో. అమరావతి అభివృద్ధి కోసం 3 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న రోజే ఈ ఘటన జరగడం మరింత ఆసక్తికరమైన విషయం. దాదాపు ఏడాదికి పైగా అమరావతి కోసం ఉద్యమిస్తున్నారు రైతులు. లాఠీ దెబ్బలు తిన్నారు.. రాజకీయ నాయకులు చేస్తోన్న జుగుప్పాకరమైన విమర్శల్ని భరించారు.. జైళ్ళకు కూడా వెళ్ళారు.. అయినాగానీ, ఏనాడూ చర్చా కార్యక్రమాల్లో రెచ్చిపోలేదు.

ఆ మాటకొస్తే, రైతులు ఆందోళన చేస్తున్న శిబిరాల ముందు నుంచే రాజకీయ ప్రముఖులు అమరావతికి వెళుతున్నారు.. ముఖ్యమంత్రి సహా.. కానీ, ఏనాడూ వారి మీద దాడులు జరగలేదు. మరి, న్యూస్ ఛానల్ చర్చ సందర్భంగా అమరావతి పేరు చెప్పి ఓ రైతు నాయకుడెందుకు చెప్పుని బీజేపీ నేత మీదకి దూసినట్టు.? తెరవెనుకాల ఎంత పెద్ద కుట్ర నడిచి వుండకపోతే ఇదంతా జరిగి వుండాలి.! అన్నది సహజంగానే వచ్చిన డౌట్.

‘చెప్పుతో కొట్టడం సబబు కాదు, కానీ.. 400 రోజులకు పైగా తాము అనుభవిస్తున్న ఆవేదనకు ఫలితమే ఇది అని మేం భావిస్తున్నాం..’ అని అమరావతి కోసం సోషల్ మీడియాలో ఉద్యమిస్తోన్న కొందరు అభిప్రాయపడుతున్నారు. అమరావతి విషయంలో వైసీపీ స్పష్టతతో వుంది. అమరావతిని చంద్రబాబు హయాంలో రాజధానిగా ప్రకటించారు గనుక, దాని స్థాయిని తగ్గించాలన్నది వైసీపీ ఆలోచన. ఇదొక రాజకీయ వ్యూహం.

బీజేపీ తీరు మాత్రం పూర్తి గందరగోళం. అమరావతి, ఆంధ్రపదేశ్ రాజధానిగా వుండాలంటూనే, మూడు రాజధానుల విషయమై జగన్ సర్కార్‌ని నిలువరించడం చేతకాక, ‘కేంద్రానికి సంబంధం లేదు..’ అని మాయమాటలు చెబుతోంది.

ఇక, చెప్పుదెబ్బలు తిన్న బీజేపీ నేత విషయానికొస్తే, ఆయన ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నోరేసుకుని విరుచుకుపడిపోవడమే తెలుసాయనకి. చర్చాకార్యక్రమాల్లో హద్దులు దాటేయడం, ఇతరుల్ని రెచ్చగొట్టడం, ఇతరులపై తీవ్రస్థాయిలో వెటకారం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏదిఏమైనా, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు క్షమార్హం కానే కాదు. ఇప్పుడీ చెప్పుదెబ్బ వెనుకాల దాగి వున్న అసలు కుట్రను ఛేదించాల్సి వుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...