అక్కినేని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ స్టార్ హీరో నాగార్జున( Nagarjuna)సోదరి నాగ సరోజ( Naga Saroja) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మంగళవారమే తుది శ్వాస విడిచినప్పటికీ ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కి నాగ సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున సంతానం. కాగా చాలా ఏళ్ల క్రితమే సత్యవతి కన్నుమూశారు. తాజాగా సరోజ మరణంతో అక్కినేని ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.
సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ సరోజ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె సినిమా షూటింగులకి గాని, సక్సెస్ సెలబ్రేషన్స్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కడ కనిపించింది లేదు. అయితే ఈ మధ్య తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా జరిగిన నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె చివరిసారిగా పాల్గొన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అంత నిరాడంబర జీవితం గడుపుతున్నందువలన ఆమె మరణ వార్త బయటకి ఆలస్యంగా వచ్చిందని అంటున్నారు.