Switch to English

టీడీపీ శ్రేణులు నిశ్చింతగా ఉండాలి: శివాజీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, అందరూ నిశ్చింతగా ఉండాలని నటుడు శివాజీ సూచించారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత ఆయన పోలింగ్ సరళిపై స్పందించారు. ఈ మేరకు శనివారం వీడియో విడుదల చేశారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ కలిసి కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని సూచించారు.

పీఏఆర్సీ అనే పేపర్ ను పట్టుకుని తామే విజయం సాధించబోతున్నట్టుగా బీజేపీ డ్రామా మొదలుపెట్టిందని విమర్శించారు. దాని ప్రకారం ఎన్టీఏకు 39, కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కు 33 సీట్లు వస్తాయని చెబుతోందన్నారు. అంటే టీఆర్ఎస్ కు 16 సీట్లు, వైఎస్సార్ సీపీకి 17 ఎంపీ సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, మొత్తమ్మీద తొలి దశ ఎన్నికల్లో ఎన్డీఏకు 72 స్థానాలు వస్తాయని జనాన్ని నమ్మించాలని చూస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం నుంచి ఈ ప్రచారం మరింత ఉధృతం చేశారన్నారు. ఎట్టకేలకు చిన్నచిన్న ప్రమాదాలతో, హత్యలతో, హింసతో ఏపీ ఎన్నికలు పూర్తయ్యాయని, ప్రజలంతా ఐక్యతతో ఉండటంతోనే ప్రశాంతంగా ముగిశాయని శివాజీ వ్యాఖ్యానించారు. తీర్పు ఏకపక్షంగా ఉందని, మళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పడబోతోందని పేర్కొన్నారు.

‘‘ఏపీ ప్రజలు ఒకవైపే ఉన్నారు. మే 23న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇందుకు సంబంధించి ముఖ్యంగా రెండు అంశాలు మనం గమనిద్దాం. చంద్రబాబుని ఓడించడానికి మహిళలంతా అర్ధరాత్రి వరకు రోడ్డుపై ఉండి జగన్ కు ఓటేయాలి. చంద్రబాబు అంత దుర్మార్గుడు లేడనే ఉద్దేశంతో ఆయనకు ఓటేయాలి. ఇక రెండోది.. జగన్ రాకపోతే మా బిడ్దల భవిష్యత్తు ఏమైపోతుందో అని భయంతో మహిళలు, వృద్ధులు అందరూ ఏకమై జగన్ కు ఓటేయాలి. ఈ రెండే కారణాలతో జగన్ గెలవాలి. లేకపోతే పూర్తి మెజార్టీతో చంద్రబాబు గెలుస్తారు. అంతే కదా.. కానీ ఈ విషయంలో బీజేపీ ఆడుతున్న డ్రామను మరింత ఉధృతం చేశారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని, జగన్ గెలుస్తున్నారని వీడియోలు రిలీజ్ చేశారు. జగన్ బెస్ట్ సీఎం అంటూ ప్రశాంత్ కిషోర్ పొగుడుతూ ఉన్న ఇంటర్నల్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈవీఎంలపై పోరుకు ఢిల్లీ వెళ్లడాన్ని ఆయన బలహీనతగా చూపించడానికి వైఎస్సార్ సీపీ నేతలు ప్రయత్నాలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బాబు వ్యూహాన్ని గమనించలేక భయపడిపోతున్నారు. కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మే 23న వెలువడబోయే తీర్పు అనూహ్యంగా ఉండబోతోంది. మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎవరూ అనవసరంగా భయపడి ఆందోళన చెందొద్దు’’ అని శివాజీ సూచించారు.

కాగా, తాను ఎవరి పక్షమూ కాదంటూ చెబుతున్న శివాజీ.. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాను టీడీపీకి వత్తాసు పలకడంలేదని చెబుతూనే ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించారు. ఆపరేషన్ గరుడ పేరుతో బీజేపీ కుట్ర చేస్తోందంటూ వీడియో విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఆయన టీడీపీ వ్యక్తి అని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి తాజాగా మంత్రి నారాయణ పీఏ, మధు అనే వ్యక్తితో మాట్లాడిన ఆడియో సంభాషణ వెలుగులోకి తెచ్చి శివాజీ గురించి ఇదీ అసలు నిజం అని పేర్కొన్నారు. అందులో శివాజీకి రూ.10 కోట్లు ఇస్తున్నామని, ఆ మొత్తం నారాయణే సమకూరుస్తున్నారని ఆయన పీఏ చెప్పినట్టుగా ఉంది. ఈ వార్త పత్రికలో వచ్చినప్పటికీ, దీనిపై వారెవరూ కాదని స్పందించకపోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....