Switch to English

తాప్సీ ఏమైనా సన్నీలియోనా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగులో పెద్దగా హిట్‌ సినిమాలేవీ లేవు తాప్సీకి. కేవలం గ్లామర్‌తో బండి నెట్టుకొచ్చేద్దామనుకుందిగానీ, తెలుగులో పప్పులుడక్కపోయేసరికి, బాలీవుడ్‌కి చెక్కేసి.. అక్కడ మాత్రం మంచి మంచి అవకాశాలు దక్కించుకుంది. అలా తాప్సీ ఖాతాలోకి కొన్ని హిట్లు వచ్చి చేరాయి. అంతే, జూలు విదిలించింది. విమర్శల బాణాల్ని ఎక్కుబెట్టేసింది. బొడ్డు మీద కొబ్బరి చిప్పలు వేయించడంలో సెక్సప్పీల్‌ ఏముంటుందో తనకర్థం కాలేదంటూ తన తొలి తెలుగు సినిమా ‘ఝుమ్మంది నాదం’ విషయాల్ని ఎత్తి చూపింది, దర్శకేంద్రుడ్ని అవమానపర్చింది కూడా.

తెలుగులో అందాల విందుకు తప్ప, నటనకు ఆస్కారం వుండదని ఎగతాళి చేసిన తాప్సీ, ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తేసరికి మాట మార్చేసి, క్షమాపణ కూడా చెప్పిన విషయం విదితమే. తెలుగులో తాప్సీకి ఇక ఛాన్స్‌ లేదని అంతా అనుకుంటున్న టైమ్‌లో ‘ఆనందో బ్రహ్మ’ సినిమా చేసి, నటిగానూ మెప్పించింది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చినప్పుడు, అంతకు ముందు తాను టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ మొసలి కన్నీరు కార్చేసింది. ఇప్పుడు మళ్ళీ తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈసారి తాప్సీ వ్యాఖ్యలు, సగటు సినీ ప్రేక్షకుడి మీద కావడం గమనార్హం.

ఐదొందలు పెట్టి మమ్మల్ని తెరపై చూడ్డానికి వస్తారుగానీ, వారి పక్కింట్లో మేం వుంటామంటే తట్టుకోలేరంటూ తాప్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ‘ముంబైలో సన్నీలియోన్‌కే ఇల్లు దొరికింది, తాప్సీకి ఇల్లు దొరకదా? అయినా, ప్రేక్షకుల్ని కించపర్చడం తాప్సీ మానుకోవాలి. ప్రపంచం చాలా మారింది. ఆ ప్రపంచంలోనే తాప్సీ కూడా వుంది’ అంటూ సోషల్‌ మీడియాలో తాప్సీ మీద మండిపడుతున్నారు.

హైద్రాబాద్‌, ఢిల్లీ ఒకేలా విశాలంగా వుంటాయనీ, ముంబై ఇరుకుగా వుంటుందనీ తాప్సీ చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమవుతున్నాయి. ఎక్స్‌పోజింగ్‌ అంటే తనకు పరమ చిరాకు అంటూనే, టూ పీస్‌ బికినీల్లో కనిపించి, అందంగా కన్పించడమంటే అది ఆటిట్యూడ్‌ని పెంచుతుందని కవరింగ్‌ ఇచ్చుకుంది తాప్సీ. సినీ పరిశ్రమలో కొందరి పట్ల ప్రేక్షకుల్లో కొంత చిన్న చూపు వున్న మాట వాస్తవం. రాజకీయ నాయకుల విషయంలోనూ అంతే. అదే సమయంలో, ఆ ప్రేక్షకులు సినిమాలు చూస్తేనే కదా, ఎవరైనా స్టార్లు అయ్యేది. ఈ చిన్న లాజిక్‌ని తాప్సీ ఎందుకు మర్చిపోయినట్లో!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...