ఎంత పకడ్బందీగా సినిమా తెరకెక్కించినా, షూటింగ్ సమయంలో స్టిల్స్ మాత్రమే కాదు, వీడియోలు కూడా లీకైపోతూ, సినిమాల్ని టెన్షన్ పెడుతున్న రోజులు. రిలీజ్‌కి ముందే సినిమాలు ఆన్లైన్లో లీక్ అయిపోవడం కూడా చూస్తున్నాం. పైరసీ కంటే పెద్ద వైరస్‌లా సినీ పరిశ్రమను పట్టి పీడిస్తోన్న రోగమిది. ‘అత్తారింటికి దారేది’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలు ఇలా మందే లీకై, సమస్యల్ని ఎదుర్కొన్నాయి. అయితే, స్క్రిప్ట్ లీక్ అవడం మాత్రం కొత్త విషయమే.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా స్క్రిప్ట్ లీక్ అవడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి, సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించిన కొంత పార్ట్‌ని సోషల్ మీడియాలో పెట్టి, ఏకంగా ‘ఇస్మార్ట్ శంకర్’ దర్శక నిర్మాతల్ని బ్లాక్మెయిల్ చేశాడు. అలర్ట్ అయిన పూరి జగన్నాథ్, ఛార్మి (ఈ చిత్రానికి నిర్మాతలు) పోలీసుల్ని ఆశ్రయించడంతో, రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తనకు ఇంటర్నెట్లో దొరికిన విషయాన్నే తన సోషల్ మీడియా పేజ్‌లో పెట్టాను తప్ప, ఎవర్నీ బెదిరించలేదంటున్నాడు అరెస్టయిన వ్యక్తి.
ఇదిలా వుంటే, అసలు ఆ స్క్రిప్ట్ ఆ వ్యక్తి వద్దకు ఎలా చేరిందన్నది అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న. షూటింగ్ జరుగుతున్న సమయంలో చాటుగా ఫొటోలు తీస్తే, అదో లెక్క. వీడియో కూడా ఇలా తీసే అవకాశముంది. కానీ, స్క్రిప్ట్‌ని దొంగిలించేందుకు ఎలా వీలు కలుగుతుంది? ఎవరో పకడ్బందీగా ప్లానేసుకుని మరీ స్క్రిప్ట్ పేపర్లను దొంగిలించి వుండాలి. దానికి ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం పనిచేస్తోన్నవారే ఎవరో సహకరించి వుండాలి. సినిమా రిలీజ్‌కి అంతా సిద్ధం చేసుకుంటున్న టైమ్‌లో ఇది నిజంగానే పూరి అండ్ టీమ్‌కి పెద్ద తలనొప్పి.
అసలే ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులతో పూరి కొంత సతమతమవుతున్నాడాయె. ఈ సినిమా హిట్ అవడం అతనికి చాలా అవసరం. సినిమా విడుదలయ్యాక దాని రిజల్ట్ ఏమవుతుందన్నది వేరే చర్చ. స్క్రిప్ట్ లీకైతే, సినిమా మీద అంచనాలేముంటాయి.? బిజినెస్ ఎలా పూర్తవుతుంది.? ఓపెనింగ్స్ ఎలా వస్తాయి.? ఇలా సవాలక్ష ప్రశ్నలున్నాయి. ఇదిలా వుంటే, ‘ఇస్మార్ట్ శంకర్’ నుంచి నిన్ననే ఓ ఆడియో సింగిల్ వచ్చింది. మాస్‌ని మెచ్చేలా ఈ పాటని తీర్చిదిద్దారనే ప్రశంసలు వస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేయడానికీ ఈ పాట దోహద పడ్తోంది. ఇంతలోనే టీమ్ ‘ఇస్మార్ట్ శంకర్’కి ఈ లీక్ కారణంగా పెద్ద షాక్ తగిలింది.
921859 933573I like this weblog so considerably, saved to my bookmarks . 124304
610805 751721This web web site may be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll surely discover it. 758575