Switch to English

కిషన్ రెడ్డి పాదయాత్ర: ఏపీలో బీజేపీకి ‘ఆశీర్వాదం’ లభిస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. నిన్న తిరుపతిలో యాత్ర పూర్తయ్యింది.. నేడు విజయవాడలో ఈ యాత్ర జరగనుంది. రాష్ట్రంలో బీజేపీ – జనసేన మిత్రపక్షాలుగా వున్నాయి. అయితే, రెండు పార్టీల మధ్యా రాజకీయ స్నేహంపై ఎప్పటికప్పుడు అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ‘అబ్బే, అదేం లేదు.. మేం కలిసే వున్నాం..’ అని పలు సందర్భాల్లో రెండు పార్టీల మధ్య జరుగుతున్న సమావేశాల ద్వారా ఇరు పార్టీలూ ఆ అనుమానాలకు తెరదించుతున్నాయి.

నో డౌట్, బీజేపీ – జనసేనల్లో.. ఓటు బ్యాంకు పరంగా పై చేయి జనసేన పార్టీదే. కానీ, ఏం లాభం.? కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో రాజకీయ పెత్తనం కోసం ఆరాటపడుతూ, ఈ క్రమంలో మిత్రపక్షం జనసేన పైనా పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో జనసేనను కాదని, బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టడమే ఇందుకు నిదర్శనం. అందుకు ఫలితం బీజేపీ అనుభవించిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర విషయానికొస్తే, బీజేపీ శ్రేణులు ఎంత హంగామా చేయాలని చూస్తున్నా, అందులో పస కనిపించడంలేదు. కేంద్ర మంత్రి నిర్వహిస్తోన్న యాత్ర.. అంటే, దానికి ఎంత పొలిటికల్ హంగామా వుండాలి.? కానీ, ఆ హంగామా పెద్దగా కనిపించడంలేదు. దానికి కారణం అందరికీ తెలిసిందే.. బీజేపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీన్ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు విషయంలో మెలిక, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా అడుగులు.. చెప్పుకుంటూ పోతే, బీజేపీ వైఫల్యాలు రాష్ట్రంలో చాలానే వున్నాయి.

‘విభజనతో కాంగ్రెస్ కొట్టిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ బీజేపీ కొట్టింది..’ అన్న భావన ఏపీలో బలపడిపోతోంది. కానీ, ఆ నెగెటివిటీని తగ్గించుకునే ప్రయత్నమే చేయడంలేదు బీజేపీ. ఇంకాస్త నెగెటివిటీని పెంచేసుకుందాం.. మిత్రపక్షం జనసేనను కూడా ముంచేద్దామన్న కోణంలో విశాఖ ఉక్కు వివాదం.. వంటివాటిని బీజేపీ తెరపైకి తెస్తోంది. ఇలాంటి రాజకీయాలతో బీజేపీ, రాష్ట్రంలో ఎన్ని పిల్లిమొగ్గలేసినా జనం నుంచి ఆశీర్వాదం లభించదుగాక లభించదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...