Switch to English

బాధ్యత లేదా.? ‘దిశ’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు ఇంకెన్నాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అర్థరాత్రి ఓ మహిళ స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా తిరగగలిగిన నాడే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లంటూ మహనీయులు చెప్పారు. కానీ, పట్ట పగలు ఓ యువతి నడి రోడ్డు మీద తిరగలేని దుస్థితి. అదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఓ వైపు జరుగుతోంటే, ఇంకో వైపు ఓ యువతిని నడి రోడ్డు మీద చంపేశాడో యువకుడు. చుట్టూ బోల్డంతమంది జనం వున్నారు. ఎవరూ ఈ హత్యను ఆపలేకపోయారు. వేడుక చూశారని అనలేంగానీ, తెగువ చూపి యువతిని రక్షించి.. హంతకుడ్ని పట్టుకోలేకపోయారు.

జనం సంగతి తర్వాత, ‘దిశ’ ఏం చేస్తోంది.? రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళ.. కష్టంలో వున్నా, పోలీసులు అక్కడ క్షణాల్లో వాలిపోతారు.. అంటూ ‘దిశ’ చుట్టూ అదికార వైసీపీ చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. పోలీసు విభాగంలో ‘దిశ’ అనే ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. దీనికీ పార్టీ రంగులు పులిమేశారనుకోండి.. అది వేరే విషయం. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి ఓ యాప్ అందుబాటులో వుండేది. పేరు మారింది.. పబ్లిసిటీ పెరిగింది తప్ప, ఈ యాప్ ద్వారా మహిళలకు లభిస్తున్న రక్షణ నిజమేనా.? అన్నదానికి మాత్రం సరైన సమాధానం దొరకడంలేదు.

హోంమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వుంటోన్న జిల్లాలో ఈ దారుణం జరిగింది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి కూత వేటు దూరంలో, చీకటి పడుతున్న సమయంలో ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ‘దిశ’ చుట్టూ పెద్దయెత్తున పబ్లిసిటీ స్టంట్లు నడిచాయి. ఇంతలోనే, ఇదిగో దళిత యువతి రమ్య హత్యకు గురైంది. లోపం ఎక్కడుంది.? ప్రభుత్వ విధానాల్లో లోపమా.? పోలీసు వ్యవస్థలో వైఫల్యమా.?

విపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసుల్ని విరివిగా వాడుతున్న అధికార పక్షం, ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో మాత్రం పూర్తిస్థాయిలో విఫలమవుతోంది. ‘గన్ కంటే.. గన్‌లోని బుల్లెట్ కంటే వేగంగా జగన్ వస్తారు..’ అంటూ మహిళల రక్షణ విషయమై సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా పలు సందర్భాల్లో చెప్పారు. ఎదీ.? ఎక్కడ.? ఒకదాని తర్వాత ఇంకోటి.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు.. హత్యాచారాలు.. జరుగుతూనే వున్నాయి. ఘటన జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం తరఫున డబ్బు వెదజల్లితే సరిపోదు.

గడచిన రెండేళ్ళలో ఇలాంటి ఎన్ని కేసుల్లో దోషులకు శిక్ష వేశారో వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సి వుంది. సుగాలి ప్రీతి హత్య వ్యవహారం తేలలేదు. అక్కడిదాకా ఎందుకు.? వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యకు గురైతే, ఇంతవరకు దోషులెవరో గుర్తించలేకపోయారు. అన్నట్టు, వైఎస్ జగన్ మీద చంద్రబాబు హయాంలో జరిగిన కోడి కత్తి దాడి మిస్టరీని ఛేదించలేకపోయారు. ఇదీ జగనన్న ఘనమైన పాలన.

కొసమెరుపేంటంటే, గుంటూరులో పట్టపగలు దళిత యువతి అత్యంత పాశవికంగా హత్యకు గురైతే.. ఇంకోపక్క ప్రభుత్వ పెద్దలు తమ పని తాము చేసుకుపోతున్నారు.. పత్రికల్లో, న్యూస్ ఛానళ్ళలో ప్రకటనలతో (స్కూళ్ళకు సంబంధించి) తమ ఘనతల తాలూకు పబ్లిసిటీలో మునిగిపోయారు. ఇదీ సమాజం పట్ల వారికున్న బాధ్యత.

3 COMMENTS

  1. 458816 531653Admiring the time and energy you put into your weblog and in depth information you offer. Its excellent to come across a blog every once in a whilst that isnt exactly the same old rehashed material. Fantastic read! Ive bookmarked your internet site and Im adding your RSS feeds to my Google account. 984610

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...