Switch to English

బర్త్ డే స్పెషల్: ‘సూర్య’.. మాస్, క్లాస్ కలగలిపిన విలక్షణ నటుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. తమిళ స్టార్ హీరోగానే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు. సినీ వారసత్వం ఉన్నా నటనలో మేటి అనిపించుకుని తండ్రిని మించిన తనయుడిగా తమిళ స్టార్ హీరోగా ఎదిగారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే కాదు.. పవర్ ఫుల్ పాత్రల్లో కూడా సూర్య తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. కెరీర్లో సూర్య ఎదిగిన తీరు పరిశీలిస్తే..

మొదట్లో సాధారణ హీరోగా కెరీర్ మొదలుపెట్టి నటనా ప్రాధాన్య పాత్రలు చేసి అనంతర కాలంలో స్టార్ హీరోగా మారిపోయాడు. స్టైలిష్ పాత్రలు చేస్తూ ప్రేక్షకాదరణ దక్కించుకోవడమే కాకుండా.. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. దీంతో తన నుంచి కొత్త సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగేలా చేసుకున్నాడు. తండ్రి శివకుమార్ తమిళ సినిమాల్లో సీనియర్ స్టార్ హీరోనే అయినా.. ఆయన ప్రభావం లేకుండా అంతకుమించి స్టార్ హీరోగా ఎదిగాడు. సూర్యలో తోటి ఆర్టిస్టులకు ఇచ్చే గౌరవం కూడా ప్రత్యేకంగా ఉండటం కూడా ఆయన్ను ప్రత్యేకంగా నిలిపింది.

సూర్య కెరీర్ ను 2005కు ముందు.. ఆతర్వాతగా చెప్పుకోవాలి. కారణం.. ఆ ఏడాది విడుదలైన ‘గజిని’ సూర్యను స్టార్ హీరోగా మార్చేసింది. తమిళ్ లోనే కాదు.. తెలుగులో కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో సూర్య నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందే. ఈ సినిమాకు మరో కోణంలో సూర్యకు సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాగా ‘సింగం’ సిరీస్ సినిమాలను చెప్పుకోవచ్చు. కథ కంటే సినిమాలో సూర్య నటన మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సూర్య ఫ్యాన్ బేస్ మరింత పెరిగిందనే చెప్పాలి.

మాస్, క్లాస్ అనే తేడా లేకుండా నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడం.. కొత్తదనం ఉన్న కథలను చేయడం సూర్య ప్రత్యేకత. శివపుత్రుడు., గజిని, సింగం ఎంత హిట్లో అంతకుమించి ప్రజాదరణ చూరగొన్న సినిమా సూరారై పొట్రు (తెలుగులో.. ఆకాశమే నీ హద్దురా). ఓటీటీలో రిలీజై అంచనాలు దాటి సంచలనాలు నమోదు చేసిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాదు.. గతేడాది ఓటీటీలో దేశంలోనే అత్యధిక వీక్షణలు దక్కించుకున్న రెండో సినిమాగా నిలిచింది. నటనతోపాటు సామాజిక సమస్యలపై కూడా సూర్య స్పందించడం గమనార్హం.

సమాజంలోని సమస్యలను పట్టించుకునే స్టార్ హీరోలు తక్కువే. వారిలో సూర్య ఒకరు. ‘అగరం ఫౌండేషన్’ ద్వారా పేద విద్యార్ధుల చదువుకు సాయం చేస్తూంటారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కూడా ఆమధ్య డిమాండ్ చేశారు. సినిమా లైఫ్ లో రీల్ హీరోగా ఎంత స్టార్ డమ్ దక్కించుకున్నాడో.. రియల్ లైఫ్ లో కూడా సూర్య తన దాతృత్వం, సమస్యలపై స్పందించే గుణంతో తమిళ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. అందుకే తమిళ స్టార్ హీరోగానే కాకుండా.. దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. నేడు ఆయన 46వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తోంది తెలుగు బులెటిన్.

యాక్టర్ సూర్య కు 46వ పుట్టినరోజు శుభాకాంక్షలు

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...