మాస్, క్లాస్ కలగలిపిన విలక్షణ నటుడు  'సూర్య' కు 46వ పుట్టినరోజు శుభాకాంక్షలు

దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. తమిళ స్టార్ హీరోగానే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు. 

సూర్య కెరీర్ ను 2005కు ముందు.. ఆతర్వాతగా చెప్పుకోవాలి. కారణం.. ఆ ఏడాది విడుదలైన ‘గజిని’ సూర్యను స్టార్ హీరోగా మార్చేసింది.

సూర్యకు సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాగా ‘సింగం’ సిరీస్ సినిమాలను చెప్పుకోవచ్చు. కథ కంటే సినిమాలో సూర్య నటన మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 

మాస్, క్లాస్ అనే తేడా లేకుండా నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడం.. కొత్తదనం ఉన్న కథలను చేయడం సూర్య ప్రత్యేకత. 

గతేడాది ఓటీటీలో దేశంలోనే అత్యధిక వీక్షణలు దక్కించుకున్న రెండో సినిమాగా సూరారై పొట్రు (తెలుగులో.. ఆకాశమే నీ హద్దురా) నిలిచింది.

నటనతోపాటు సామాజిక సమస్యలపై కూడా సూర్య స్పందించడం గమనార్హం. సమాజంలోని సమస్యలను పట్టించుకునే స్టార్ హీరోలు తక్కువే. వారిలో సూర్య ఒకరు. 

అగరం ఫౌండేషన్’ ద్వారా పేద విద్యార్ధుల చదువుకు సాయం చేస్తూంటారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కూడా ఆమధ్య డిమాండ్ చేశారు.