Switch to English

ముఖ్యమంత్రిగా తొలి రోజే మాట తప్పిన వైఎస్‌ జగన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారు. ‘మాట తప్పను, మడమ తిప్పను..’ అని గడచిన తొమ్మిదేళ్ళుగా చెబుతూ వచ్చిన వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి పీఠమెక్కగానే మాట తప్పడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెంటనే, వృద్ధాప్య పెన్షన్‌ని 3 వేలకు పెంచుతామని అవ్వా తాతలకు చెప్పండి..’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి పీఠమెక్కా, ‘వాయిదాల పద్దతి’లో పెంచుతానని ప్రకటించడంతో రాష్ట్ర ప్రజానీకం షాక్‌కి గురయ్యింది.

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ నుంచి ఇలాంటి ప్రకటనను తాము అస్సలు ఊహించలేదని 3 వేల పెన్షన్‌ కోసం ఎదురుచూస్తోన్న అవ్వాతాతలు వాపోతున్నారు. తొలి ఏడాదికి 250 రూపాయల పెంపు, ఆ తర్వాతి ఏడాది ఐదొందలకు పెంపు, మూడో ఏడాదికి 750 పెంపు, నాలుగో ఏడాదికి వెయ్యి పెంచి, మొత్తం మూడు వేలు ఇస్తామని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంబంధిత దస్త్రంపై సంతకం చేయడం గమనార్హం. అంటే, ఇప్పుడున్న 2 వేల రూపాయల పెన్షన్‌కి ఇంకో రెండు వందల యాభై రూపాయలు మాత్రమే జోడించి, జూన్‌ 1వ తేదీ నుంచి 2250 రూపాయల పెన్షన్‌ని అవ్వా తాతలకు అందించబోతుందన్నమాట జగన్‌ ప్రభుత్వం.

గత కాంగ్రెస్‌ హయాంలో 200 రూపాయలున్న పెన్షన్‌, చంద్రబాబు హయాంలో తొలుత వెయ్యి రూపాయలకు చేరుకుంది. సరిగ్గా ఎన్నికలకు ముందర ‘ఎన్నికల తాయిలం’గానే అయినా చంద్రబాబు వెయ్యి రూపాయల పెన్షన్‌ని ఒకేసారి రెండు వేల రూపాయలకు పెంచేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్‌ ఇస్తాం’ అని చంద్రబాబు చెప్పినా, జనం చంద్రబాబుకి తిరిగి అధికారం కట్టబెట్టలేదు. వైఎస్‌ జగన్‌ తమ పెన్షన్‌ని మూడు వేలకు పెంచుతాడని భావించి, ఓట్లేసిన అవ్వాతాతలిప్పుడు షాక్‌కి గురయ్యారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారనీ, జగన్‌ మాట తప్పే మనిషి కాదని వైఎస్సార్సీపీ నేతలు బుకాయిస్తున్నారు. మరోపక్క, విపక్షాలకు ఇదొక ఆయుధంగా మారే అవకాశముంది అధికార పార్టీపై ఎదురుదాడికి దిగేందుకు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీని విడతలవారీగా చేస్తామని చెబితే, ‘అదెలా కుదురుతుంది.?’ అని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌, చంద్రబాబుని ‘మోసకారి’గా అభివర్ణించారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా, ముఖ్యమంత్రి పీఠమెక్కాక, ‘మడమ తిప్పక తప్పలేదు’ అన్నమాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...