Switch to English

ఏపీలో సంక్షేమ క్యాలెండర్.. ఫ్లాప్ షో అవబోతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అధికారంలోకి వస్తూనే కనీ వినీ ఎరుగని రీతిలో ఎడా పెడా సరికొత్త సంక్షేమ పథకాల్ని తెరపైకి తెచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నవరత్నాలు.. దాంతోపాటుగా మరికొన్ని ఆణిముత్యాల్ని సంక్షేమం పేరుతో ప్రజలకు అందిస్తూ, అంతకు మించిన పబ్లసిటీ స్టంట్లు చేస్తూ.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ప్రతి ఏడాదీ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి, దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది జగన్ సర్కార్ ప్లానింగ్. అందుకు తగ్గట్టుగానే కొన్ని పనులు ఇప్పటిదాకా జరిగాయి. కానీ, ఇకపై ఎలా.? కొత్తగా అప్పులు చేయడానికి కేంద్రం కొర్రీలు పెడుతున్న పరిస్థితి.

పెరిగిపోయిన అప్పులకు వడ్డీలు కట్టాలన్నా కష్టంగానే మారుతున్న పరిస్థితి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా కొత్త అప్పులు చేయాల్సిందే. ఇంత భయానక పరిస్థితుల నడుమ, సంక్షేమ క్యాలెండర్ అమలవడం అనేది సాధ్యమేనా.? గత ఫిబ్రవరిలో ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ విషయానికొస్తే, ఏప్రిల్ నెలలో అమలవ్వాల్సిన సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది.

సగం నెల గడిచిపోయినా, ఐదు పథకాలకు సంబంధించి నిధుల విడుదల కష్టంగా మారిపోయిందట. దాంతో, ముఖ్యమంత్రి నుంచి ఎప్పుడు సానుకూల సంకేతం వస్తుందా.? అని అధికారులు ఎదురుచూస్తున్నారట. ముఖ్యమంత్రి మీట నొక్కితే తప్ప, నిధులు విడుదలయ్యే పరిస్థితి లేదనీ, అలా మీట నొక్కడానికి కూడా అక్కడ ఖజానాలో నిధుల్లేవనీ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదెంతవరకు నిజం.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

‘విపక్షాల దుష్ప్రచారం’ అని అధికార పార్టీ చెప్పడం మామూలే. కానీ, ప్రతి నెలా.. ఆదాయం – అప్పుల లెక్కలు బయటకు వచ్చేస్తున్న దరిమిలా, అప్పుల కష్టాల వ్యవహారం బహిరంగ రహస్యమే. ఇప్పుడే ఇలా వుంటే ముందు ముందు సంక్షేమ క్యాలెండర్ అమలు ఎలా.? ఇదొక ఫ్లాప్ షోగా మిగిలిపోతుందా.? రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని పూర్తిగా ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తే, ఆ తర్వాత అధికార వైసీపీ పరిస్థితేంటి.? ఏమో, వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...