Switch to English

ఎర్రన్నా, ఆ ముగ్గుర్నీ గెలిపించావన్నా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు ఈసారి విజయం సాధించారు. అందులో ఒకరు ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు కాగా, మరొకరు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌నాయుడు. ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ సైతం ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు తమ సిట్టింగ్‌ స్థానాల్ని నిలబెట్టుకోవడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

ఓ దశలో అచ్చెన్నాయుడు ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. రామ్మోహన్‌నాయుడు అయితే బొటాబొటి మెజార్టీతో గట్టెక్కారు. అచ్చెన్నాయుడిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు పేరు చెబితే అభివృద్ధి గుర్తుకు రాదు సరికదా, అరాచకాలే గుర్తుకొస్తాయంటారు చాలామంది. అయితే, అదంతా ప్రత్యర్థుల పసలేని ఆరోపణలు తప్ప, నిజం కావనీ, అందుకు తన గెలుపే నిదర్శనమనీ అచ్చెన్నాయుడు అంటున్నారు.

మరోపక్క, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా షాక్‌ తగిలింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవిపై సానుకూలత వున్నా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వేవ్‌ కారణంగా ఆమె పరాజయం పాలయ్యారు. గెలవడం అసాధ్యమనుకున్న ధర్మాన ప్రసాదరావు ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇక, అచ్చెన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ విషయానికొస్తే ఆమె అనూహ్యంగా టిక్కెట్‌ దక్కించుకున్నారు, అంతే అనూహ్యంగా విజయాన్ని అందుకున్నారు. చివరి నిమిషంలో టిక్కెట్‌ ఖరారైనా, మెరుపు వేగంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆదిరెడ్డి భవానీ, దాదాపు ప్రతి ఇంటి తలుపూ తట్టి, తన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ఇక్కడ క్రాస్‌ ఓటింగ్‌ చాలా ఎక్కువగా జరగడం గమనార్హం.

ఏదిఏమైనా ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు చట్ట సభలకు ఎంపిక కావడం పట్ల శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మినహాయిస్తే రామ్మోహన్‌నాయుడు, ఆదిరెడ్డి భవానీల పట్ల పార్టీలకతీతంగా సానుకూలత వుంది. అదే వారి గెలుపుకు కారణమైంది. ఐదేళ్ళు ఎంపీగా పనిచేసినా రామ్మోహన్‌నాయుడిపై ఒక్క అవినీతి మరకా అంటలేదు సరికదా, మంచి వక్తగా.. అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన విజయం నల్లేరు మీద నడకేనని చిక్కోలు ప్రజానీకం అనుకున్నారుగానీ, వైఎస్సార్సీపీ సునామీ ముందు ఆయన కూడా ఒకింత వణకక తప్పలేదు. ఎలాగైతేనేం, చివరికి రామ్మోహన్‌ విజయాన్ని అందుకున్నారు. రామ్మోహన్‌నాయుడు, ఆదిరెడ్డి భవానీల గెలుపుతో ‘ఎర్రన్నా.. గెలిపించావన్నా’ అని అనుకుంటున్నారు ఎర్రన్నాయుడు అభిమానులు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...