Switch to English

తిరుపతి ఉప ఎన్నిక: జనసేనాని పవన్ అనుమానమే నిజమవుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి గనుక బరిలోకి దిగితే, బీజేపీ జాతీయ నాయకత్వం.. తిరుపతి ఉప ఎన్నికను అత్యంత సీరియస్‌గా తీసుకుని, గెలుపు కోసం కృషి చేయాలి.. అదే, జనసేన పార్టీ గనుక బరిలోకి దిగితే.. ప్రతి నియోజకవర్గంలోనూ స్వయంగా నేనే పర్యటించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను..’ అంటూ కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకోకపోతే, ప్రజల్లోకి బీజేపీ – జనసేన కూటమిపై తప్పుడు సంకేతాలు వెళతాయనే అనుమానాన్ని గతంలోనే జనసేన అధినేత వ్యక్తం చేశారు. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం.. తిరుపతి ఉప ఎన్నికను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు కనిపించడంలేదు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా కావొచ్చు, మరో కారణం వల్ల కావొచ్చు.. జాతీయ నాయకత్వం.. అంటే కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ.. తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేకమైన దృష్టి పెట్టలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావాల్సింది.. కానీ, పవన్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళడంతో అది సాధ్యపడటంలేదు.

ఇక, తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘తిరుపతి ఉప ఎన్నిక వార్మప్ మ్యాచ్ లాంటిది’ అన్నది నాదెండ్ల ఉవాచ. ఇక్కడ ‘వార్మప్’ అంటే, జనసేన – బీజేపీ మధ్య కార్యకర్తల స్థాయిలో సమన్వయం.. అని అనుకోవాలేమో. జమిలి ఎన్నికలొచ్చినా, అంతకు ముందే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. బీజేపీ – జనసేన మధ్య సమన్వయం అవసరం. ఆ సమన్వయం అయితే వుండాల్సిన స్థాయిలో లేదనేది నిర్వివాదాంశం.

అలా సమన్వయం వుండాలంటే, ముందుగా బీజేపీ అగ్రనాయకత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రత్యర్థిగా చూడాలి. పూటకో మాట మార్చే ఏపీ బీజేపీ నేతలు వైసీపీ మీద ఏం మాట్లాడినా అది నమ్మేలా వుండదు. ఇవన్నీ జనసేనాని పరిగణనలోకి తీసుకునే, బీజేపీకి ముందస్తు హెచ్చరిక చేశారు. కానీ, ఆయన అనుమానమే నిజమైంది.. తాటాకు చప్పుళ్ళలా తప్ప, వైసీపీ అదిరిపడేలా తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోలేకపోతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...