Switch to English

పరశురామ్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమలో ఈక్వేషన్స్‌ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓ డైరెక్టర్‌తో సినిమా అనుకున్నా, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి మరో డైరెక్టర్‌తో సినిమాకి కమిట్‌ అవడం హీరోలకు కొత్తేమీ కాదు. డైరెక్టర్లు మారతారు, హీరోయిన్లు మారిపోతారు, హీరోలు మారిపోతారు, అంతెందుకు నిర్మాతలూ మారిపోయిన సందర్భాలున్నాయి. ‘గీత గోవిందం’ సినిమా తర్వాత డైరెక్టర్‌ పరశురామ్‌ తన తదుపరి సినిమా కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికీ అతని తదుపరి సినిమా కన్‌ఫామ్‌ కాలేదు. ‘గీత గోవిందం’ లాంటి సంచలన విజయం సాధించాక ఏ దర్శకుడైనా ఇంత కాలం ఎదురుచూస్తాడా? కానీ, దురదృష్టవశాత్తూ అతనికి ఎదురుచూపులు తప్పలేదు.

ఓ దశలో అక్కినేని అఖిల్‌ హీరోగా పరశురామ్‌ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలొచ్చాయి. ప్రస్తుతం మహేష్‌, పరశురామ్‌ కాంబినేషన్‌లో సినిమా కన్‌ఫామ్‌ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. కానీ, మహేష్‌ ఇప్పుడేమంత ఖాళీగా లేడు. అనిల్‌ రావిపూడితో సినిమా చేయాల్సి వుంది. దాంతో, పరశురామ్‌ – మహేష్‌తోనే సినిమా చేయాలంటే ఇంకా చాలా సమయం ఎదురుచూడాలి. తాజాగా మెగా క్యాంప్‌లో చక్కర్లు కొడ్తోన్న ఓ గాసిప్‌ ప్రకారం, పరశురామ్‌ – రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనే ఆలోచనతో వున్నాడట.

పరశురామ్‌ ఇప్పటికే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌తో కనెక్ట్‌ అయి వున్నాడు. ఖచ్చితంగా అతని తదుపరి సినిమా ఆ బ్యానర్‌లోనే వుంది. గీతా బ్యానర్‌ అంటే రామ్‌చరణ్‌కి సొంత బ్యానర్‌ కిందే లెక్క. అయితే, చరణ్‌ కూడా ఖాళీగా లేడిప్పుడు. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చేస్తున్న చరణ్‌, కొంచెం గ్యాప్‌ చూసుకుని పరశురామ్‌కి టైమ్‌ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఆ దిశగా రామ్‌చరణ్‌, రాజమౌళితో మంతనాలు జరుపుతున్నాడట. ఇటీవల చరణ్‌ కాలికి గాయం కావడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ కాస్త వాయిదా పడింది. మళ్ళీ ఈ నెల 21 నుంచి హైద్రాబాద్‌లోనే షూటింగ్‌ జరగనుంది.

రాజమౌళి సాధారణంగా అయితే తన సినిమాలో నటించే హీరోలు ఇంకో సినిమా చేస్తానంటే ఒప్పుకోడు. మరి, చరణ్‌ ఎలా రాజమౌళిని ఒప్పిస్తాడన్నదే ప్రశ్న. ‘బాహుబలి’ కోసం ప్రభాస్‌ని చాలాకాలం ఇంకో సినిమా చేయకుండా ఆపేశాడు రాజమౌళి, ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ, రామ్‌చరణ్‌ పరిస్థితి వేరు. ఇప్పుడు మారిన ఈక్వేషన్స్‌ వేరు. సో, చరణ్‌ – రాజమౌళిని ఒప్పిస్తే, పరశురామ్‌ సినిమాని కూడా సైమల్టేనియస్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు నడిపించొయొచ్చు. ఈ గాసిప్‌లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...