Switch to English

Home సినిమా సినిమా రివ్యూ : ఎబిసిడి

సినిమా రివ్యూ : ఎబిసిడి

0
సినిమా రివ్యూ : ఎబిసిడి
movie-review
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, భరత్, రాజా తదితరులు
సంగీతం : జూదా శాండీ
కెమెరా : రామ్
ఎడిటింగ్ : నవీన్ నూలి
దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్, యాష్ రంగినేని

అల్లు శిరిష్ .. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. శిరీష్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పరాజయాలే ఎక్కువ. అందుకే భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ఇమేజ్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన అమెరికన్ బోర్న్ .. కన్ఫ్యుజడ్ దేశి ( ఎబిసిడి ) టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, మరి ఈ సినిమాతో అల్లు శిరిష్ హిట్ అందుకున్నాడా? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

అరవింద్ ( అల్లు శిరీష్ ) అమెరికాలో సెటిల్ అయిన ఎన్నారై ( నాగబాబు ) కొడుకు. డబ్బులో పుట్టి .. డబ్బులో పెరగడం వల్ల అతనికి ఏమాత్రం డబ్బు విలువ, జీవితం విలువ తెలియకుండా పెరుగుతాడు. కొడుకు వల్ల రోజు సమస్యలు వస్తుంటాయి తండ్రికి. దాంతో ఎలాగైనా సరే తన కొడుకుని ఇండియా పంపించి అక్కడే అతనికి డబ్బు, జీవితం విలువ తెలిసివచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తాడు. అరవింద్ తో పాటు అతని బావమరిది బాషా ( భరత్ ) ని ఇండియా కు పంపిస్తాడు. ఇండియాకు వచ్చిన అరవింద్ అండ్ బాషాలకు ఇక్కడి స్టార్ హోటల్స్ లో ఉంటూ నెలరోజులు కాలం గడపాలని ప్లాన్ చేస్తారు కానీ ఆలా కాదని .. ఒక మధ్యతరగతి మాస్ ఏరియాలో ఒక రూములో ఉంటూ కేవలం నెలకు 5000 రూపాయలకే జీవితం గడపాలని కండిషన్స్ పెడతాడు. ఆ తరువాత ఇక్కడే ఎంబీఏ చేయాలనీ ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటాడు అరవింద్ తండ్రి. దాంతో నెలరోజులు అనుకున్నది కాస్త రెండేళ్లు గడపాల్సి వస్తుంది. కాలేజ్ లో నేహా ( రుక్సార్ థిల్లాన్ ) పరిచయం ప్రేమగా మారడంతో పాటు అరవింద్ లో లైఫ్ స్టయిల్ లో కూడా మార్పులు వస్తాయి. రోజుకు కేవలం 82 రూపాయలతో జీవితం గడుపుతుంటారు. ఆ తరువాత అరవింద్ ఓ పొలిటీషియన్ కొడుకు భార్గవ్ ( రాజా ) తో ఎందుకు విరోధం పెంచుకున్నాడు? అసలు అరవింద్ జీవితం, డబ్బు విలువ తెలుసుకున్నాడా ? లేక జీవితంలో ఓడిపోయి అమెరికా వెళ్ళిపోయాడా లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

నటీనటుల ప్రతిభ :

తన కెరీర్ లో సరైన హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్ ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు ..కానీ కొన్ని సన్నివేశాల్లో శిరీష్ నటన తేలిపోయింది. హీరోగా అన్ని రకాల ఎమోషన్స్ చేయాలనీ చేసిన ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. గత సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ రుక్సార్.. సినిమాలో ఎదో హీరోయిన్ కావాలి కాబట్టి ఉన్నట్టుంది తప్ప.. ఎక్కడ ఆమె పాత్రకు ప్రాధాన్యత కానీ ఆమెకు నటించే ఛాన్స్ కానీ లేకపోయింది. పోనీ హీరోతో అయిన ఓ మంచి రొమాంటిక్ సాంగ్ ఉందా అంటే అదికూడా లేదు. ఇక బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన భరత్ ( డీ, రెడీ ఫేమ్ )..ఈ సినిమాలో కాస్త కామెడీ చేయాలనీ చేసిన ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. కాకపోతే అతడికి కమెడియన్ గా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. ఇక నాగబాబు, మిగతా నటీనటులు వారి వారి పరిధిలో బాగానే చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమాకు ఫోటోగ్రఫి పెద్ద ఎస్సెట్ గా చెప్పుకోవచ్చు. చాలా సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. ఇక జూదా శాండీ అందించిన మ్యూజిక్ పరవాలేదనిపిస్తుంది. పెద్దగా ఆకట్టుకునే పాటలు కనిపించవు. పైగా రీ రికార్డింగ్ కూడా యావరేజ్. నవీన్ నులి ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాతలు పాటించిన విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సంజీవ్ రెడ్డి కథ, కథనాలే పెద్దగా ఆకట్టుకునేలా లేవు. కథ విషయంలో స్లోగా సాగిపోవడం, ఎక్కడ అనూహ్యమైన మలుపులు అంటూ లేకపోవడంతో సినిమా అంతా బోర్ గా సాగిపోయింది. కనీసం ప్రేమ విషయంలో అయిన ఏదైనా కొత్త ఐడియా వర్కవుట్ చేసారా అంటే అది లేదు .. హీరో కాబట్టి తప్పకుండా హీరోయిన్ లవ్ చేస్తుంది అన్న ఆలోచనలోనే సాగిపోయింది. ఎక్కడ సినిమాపట్ల ఆసక్తి కనిపించదు. పైగా బోర్ కొట్టేస్తుంది. ఏమాత్రం ఆకట్టుకొని డైలాగ్స్, దర్శకత్వ పనితీరు సినిమాకు మైనస్ గా మారాయి.

విశ్లేషణ :

బాగా డబ్బున్న ఓ ఎన్నారై కుర్రాడు జీవితం మరియు డబ్బు విలువ తెలియడం కోసం ఇండియా పంపబడతాడు. అతడు ఇండియా రావడంతో మొదలైన కష్టాలేమిటి ? జీవితం గురించి తెలుసుకునే అంశాలేమిటి ? అనే చక్కని పాయింట్ తో కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు ఎక్కడా కూడా ఆసక్తి కలిగించే సన్నివేశాలు కానీ మాటలు కానీ రాసుకోలేదు. కథనం విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. హీరో పాత్ర తాలూకు ఎమోషన్స్ ఏమాత్రం చూపించే ప్రయత్నం చేయలేదు. కథలో మలుపు తిరగాల్సిన అంశాలు లేకపోవడంతో కథనం మొత్తం నీరసంగా సాగుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. మొదటి భాగం మొత్తం కాస్త హుషారుగా సాగినా .. రెండో భాగం మాత్రం సాగతీతగా మారింది. హీరో, విలన్ లను బాగానే చూపించిన దర్శకుడు వారిద్దరి మధ్య ఉన్న వైరాన్ని మాత్రం ఎక్కువ ఫోకస్ చేయలేకపోవడం. క్లైమాక్స్ లో కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఉన్నంతలో హీరో శిరీష్ సినిమాను నిలబెట్టే ప్రయత్నాలు అయితే చేసాడు. ప్రేమ సన్నివేశాలు బలహీనంగా ఉంటాయి. మొత్తానికి ఎబిసిడి టైటిల్ కి తగ్గట్టే .. ప్రేక్షకుడి కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఇందులో పెద్దగా ఆకట్టుకునే విషయాలేవి లేకపోవడం పెద్ద మైనస్.

ట్యాగ్ లైన్ : కన్ఫ్యూజ్డ్ డ్రామా ..