Switch to English

వైఎస్ జగన్ మండలి రాజకీయం: చెప్పేదొకటి, చేసేదింకొకటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజకీయ నాయకులకు రెండు నాల్కలేం ఖర్మ.. వెయ్యి నాలికలు వుంటాయేమో. లేకపోతే, చెప్పే మాటలకీ.. చేసే చేతలకీ సంబంధం లేకపోయినా, ప్రజల్ని మభ్యపెడుతూనే వుంటారు. కార్యకర్తలు వెర్రి వెంగళప్పల్లా.. ‘ఏం మాట్లాడుతున్నాడు రా మన నాయకుడు..’ అనుకుంటారు తప్ప, నాయకుడు మాట్లాడేది నిజమా.? కాదా.? అని మాత్రం ఆలోచించరు. ఫలానా నాయకుడు.. అని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు.. రాజకీయాల్లో నూటికి 99 శాతం మంది నాయకులు ఇలాగే వుంటారు. చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైనా ఒకటే.

శాసనమండలి విషయానికే వద్దాం. శాసన మండలిని రద్దు చేయాలన్నది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) నినాదం. ఈ మేరకు అసెంబ్లీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘమైన, అత్యద్భుతమైన ప్రసంగం కూడా చేసేశారు. శాసన మండలి అనేది ఖర్చు దండగ వ్యవహారమని ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలంతా తేల్చేశారు. శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్రానికి పంపించేశారు కూడా. కానీ, కేంద్రంపై ఈ విషయమై ఒత్తిడి తీసుకురావడంలేదు.

ఇంకోపక్క, మండలిలో సభ్యుల పదవీ కాలం ముగుస్తుండడంతో కొత్తవారికి అవకాశాలొస్తున్నాయి.. ఈ మేరకు అధికార పార్టీ ‘నియామకాలు’ జోరుగా చేపడుతోంది. ‘ఖాళీల్ని పూరించాల్సిందే కదా..’ అని వైసీపీ చెప్పుకోవచ్చుగాక. కానీ, అసెంబ్లీలో శాసన మండలి విషయమై ఏం మాట్లాడారు.? ఇప్పుడు ఏం చేస్తున్నారు.? ఖర్చుదండగ వ్యవహారానికి.. ఇంత హైడ్రామా అవసరమా.? పైగా, ‘మాటకు కట్టుబడి.. విధేయతకు పట్టంకట్టి..’ అంటూ కొత్తగా ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వడం గురించి వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది అధికార పార్టీ తీరు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ఎటూ శ్రద్ధ లేదు.. కనీసం, ‘మాట తప్పడు.. మడమ తిప్పడు..’ అని జగన్ గురించి గట్టిగా చెప్పుకుంటున్నారు కాబట్టి, శాసన మండలి లాంటి విషయాల్లో అయినా తమ ‘చిత్తశుద్ధి’ని వైసీపీ నిరూపించుకోవాలి కదా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...