Switch to English

సోలో బ్రతుకే సో బెటర్ రివ్యూ – సోలో బ్రతుకే సో బోరింగ్.!

Critic Rating
( 2.25 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow
Movie సోలో బ్రతుకే సో బెటర్
Star Cast సాయి ధరమ్ తేజ్, నభ నటేష్, రావు రమేష్
Director సుబ్బు
Producer బివిఎస్ఎన్ ప్రసాద్
Music థమన్ ఎస్
Run Time 2 గంటల 6 నిమిషాలు
Release డిసెంబర్ 25, 2020

కరోనా పాండెమిక్ తో మార్చిలో మూతబడిపోయిన సినిమా థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి రావడం మొదలు పెడుతున్నారు. ఈ సమయంలో టాలీవుడ్ నుంచి రిలీజవుతున్న మొదటి బిగ్ బడ్జెట్ అండ్ స్టార్ హీరో ఫిల్మ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభ నటేష్ జంటగా నటించిన ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరి సపోర్ట్ లభించడంతో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఆ క్రేజ్ ని అందుకునేలా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఉందో? లేదో? ఇప్పుడు చూద్దాం.

కథ:

మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతకమనే రైట్స్ ఇస్తే, మనం ప్రేమ – పెళ్లి పేరుతో ఆ స్వేచ్చని నాశనం చేసుకుంటున్నామని అందుకే ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా హ్యాపీగా బ్రతకాలనేదే మన హీరో విరాట్ (సాయి తేజ్) సిద్ధాంతం. అందులో భాగంగానే విరాట్ ఆర్ నారాయణమూర్తిని స్ఫూర్తిగా తీసుకునే వీరాభిమాని. తను అలా తయారవ్వడానికి కారణం తన మామయ్య (రావు రమేష్). కాలేజ్ పూర్తిచేసుకున్న విరాట్ కి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ రావడంతో హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ వెన్నెల కిషోర్ – అమృత(నభ నటేష్) పెళ్ళిలో, అమృత తన పెళ్లి కాన్సల్ చేసుకొని విరాట్ ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ పెళ్లి కాన్సల్ చేస్తుంటుంది. అసలు అమృత ఎవరు? ఎందుకు విరాట్ కి ప్రపోజ్ చేసింది? ప్రేమ పెళ్లి అంటే ఇష్టంలేని విరాట్ అమృత ప్రేమలో పడ్డాడా? పడితే అతని ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? విరాట్ ని ప్రేమ, పెళ్లి అంటే అసహ్యం వచ్చేలా రావు రమేష్ ఎందుకు చెబుతుంటాడు? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ కథ..

తెర మీద స్టార్స్..

విరాట్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ విరాట్ పాత్రలో సూపర్బ్ గా సెట్ అయ్యాడు.. అలాగే బ్యాచిలర్స్ కి బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్ మోడ్యులేషన్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి అర్ధభాగంలో తన హావభావాలు బాగా నవ్విస్తాయి. నభ నటేష్ చూడటానికి క్యూట్ గా పక్కింటి అమ్మాయిలా కనిపించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్ లో బాగానే చేసింది. ఇకేపోతే సినిమాకి కీలకమైన పాత్రలో కనిపించినరావు రమేష్ మరోసారి హైలైట్ గా నిలిచాడని చెప్పాలి.. అటు వెటకారపు మాడ్యులేషన్ లో, ఇటు ఎమోషనల్ సీన్స్ లో సూపర్బ్ గా నటించి సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ లా నిలిచాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్, నరేష్ లు తమ పాత్రల్లో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ నవ్విస్తాయి అందులో హీరో ఫ్రెండ్ పాత్రలో సత్య కొంత నవ్విస్తాడు.

తెర వెనుక టాలెంట్..

తొలి సినిమా దర్శకుడు సుబ్బు ఎంచుకున్న స్టోరీ పాయింట్, హీరో – హీరోయిన్ పాత్రలు అందరికీ కనెక్ట్ అయ్యేవే తీసుకున్నారు. కానీ పూర్తి కథగా తయారయ్యేటప్పుడు మాత్రం చాలా రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్లిపోయారు. దాని వలన సెకండాఫ్ అంతా రొటీన్ పంథాలో సాగడం, ప్రేమకథలో కనెక్ట్ కావాల్సిన ఎమోషన్స్ ని సరిగా రీచ్ చేయకపోవడం వలన ప్రీ క్లైమాక్స్ నుంచీ ఇంకా ఎంతసేపు సాగదీస్తారు, మాకు తెలిసిందేగా కలిపేసి శుభం కార్డు వేసేయండి అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో సరదాగా అనిపించే కామెడీ ఉన్నా సెకండాఫ్ లో చేసిన కామెడీ మరీ రొట్ట అనేలా ఉండడం, వెన్నెల కిషోర్ ట్రాక్ వర్కౌట్ కాకపోవడం వలన బోరింగ్ అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ గా సుబ్బు అనుకున్న పాయింట్ ని రావు రమేష్ ద్వారా చెప్పగలిగారు కానీ హీరో – హీరోయిన్ పాత్రలో అంత బాగా చెప్పలేకపోయారు. దాంతో మొత్తంగా ఒక 50% మార్కులు మాత్రమే సంపాదించుకోగలిగాడు. స్పెషల్ గా అటు సోలో అని చెప్పడానికి, ఎమోషనల్ సీన్స్ కి సుబ్బు రాయూస్కున్న డైలాగ్స్ బాగున్నాయి.

వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో తన విజువల్స్ తో క్రియేట్ చేసిన మూడ్ చాలా బాగుంది. ఆ విజువల్స్ కి థమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసాడు. అలాగే ఇప్పటికే హిట్ అయినా పాటలు విజువల్ గా చూసాక ఇంకా బాగా రీచ్ అవుతాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగా అనిపించినా, సెకండాఫ్ లో మాత్రం బోరింగ్ గా అనిపిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సాయి ధరమ్ తేజ్ పాత్ర అండ్ పెర్ఫార్మన్స్
– ఫస్ట్ హాఫ్ లో సరదాగే కామెడీ
– రావు రమేష్ ఎమోషనల్ ఎపిసోడ్స్
– డైలాగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– ఫస్ట్ హాఫ్ తర్వాత కథ రొటీన్ పంథాలో వెళ్లడం
– సాగదీసి వదిలిన సెకండాఫ్
– నవ్వించలేకపోయిన రొటీన్ వెన్నెల కిషోర్ – ఆది కామెడీ ట్రాక్
– పాయింట్ సేమ్ కాకపోయినా ఇదే తరహాలో చాల సినిమాలు చూడడం
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

చాలా రోజులకి థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందనుకున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ‘సోల్ లెస్’ అనేలా ఉంది. ప్రేమ, పెళ్లి అంటే పడదు, ఫైనల్ గా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు అనే సింగిల్ లైన్ పాయింట్ తో చేసిన ఈ సినిమాలో సోలో బ్రతుకే సో బెటర్ అన్నంతవరకూ బాగుంది, కానీ ఎప్పుడైతే సోలో బ్రతుకే సోల్ లెస్ అంటారో అక్కడి నుంచి డ్రాప్ అయి చివరికి పూర్తిగా బోర్ కొట్టించేసింది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మళ్ళీ థియేటర్స్ కళకళలాడుతాయి అనుకున్నారు కానీ సినిమా చూసాక ఈ సినిమా థియేటర్స్ వెలవెలబోతాయి అనిపిస్తోంది. ఎందుకంటే కరోనా వలన థియేటర్స్ కి రావడానికి ప్రేక్షకులు ధైర్యం చేయట్లేదు, వాళ్ళు సినిమాకి రావాలంటే ఇది పక్కా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తే తప్ప జరగదు. సోలో బ్రతుకే సో బెటర్ ఆ ఫీల్ ని క్రియేట్ చేయలేదు. కావున ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం కష్టమే సుమీ..

చూడాలా? వద్దా?: రిస్క్ చేసి థియేటర్ కి వెళ్లి ఎక్స్పీరియన్స్ చేసే సినిమా అయితే కాదు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.25/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...