సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంతో తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. ఈనెల 31 తన పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని తలైవా వెల్లడించారు. ఈ సమయంలో తమిళ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కుమారుడు అళగిరి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే అంశం చర్చనీయాంశమైంది. అయితే, ఈ విషయంపై జనవరి 3న నిర్ణయం తీసుకుంటానని అళగిరి ప్రకటించడం మరింత ఉత్కంఠ రేపుతోంది.
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన తల్లి దయాళు అమ్మాళ్ ను పరామర్శించడానికి గోపాలపురం వచ్చిన అళగిరి మీడియాతో మాట్లాడారు. జనవరి 3న తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై కొత్త పార్టీ విషయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కార్యకర్తలు కొత్త పార్టీ పెట్టాలని కోరితే తప్పకుండా పార్టీ స్థాపిస్తానన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఎంకేకు మాత్రం మద్దతివ్వనని స్పష్టంచేశారు. డీఎంకేలోకి తిరిగి రావాలని తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. హైదరాబాద్ షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రజనీని కలుస్తానని పేర్కొన్నారు.
867404 703611Fantastic post, I conceive blog owners need to acquire a good deal from this internet blog its real user pleasant. 120616
271044 530400Oh my goodness! a great post dude. Thanks Nevertheless My business is experiencing concern with ur rss . Dont know why Not able to sign up for it. Possibly there is any person obtaining identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 851013
324864 116075Intriguing post. Positive that Ill come back here. Very good function. 185425