Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: లక్ష్మీ – తుస్సుమన్న దీపావళి పటాకా ఈ ‘లక్ష్మీ’ బాంబ్.!

Critic Rating
( 1.50 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow
Movie లక్ష్మీ
Star Cast అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, శరద్ కేల్కర్
Director రాఘవ లారెన్స్
Producer ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, షబీనా అండ్ తుషార్ ఎంటర్టైన్మెంట్స్
Music అమర్ మొహిలే
Run Time 2 గంటల 21 నిముషాలు
Release నవంబర్ 9, 2020

2011లో తెలుగు, తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యి, కన్నడలో కూడా రీమేక్ అయ్యి హిట్ అయిన ‘కాంచన’ సినిమాని దాదాపు 8 ఏళ్ళ తర్వాత హిందీలో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ముందే రిలీజ్ కావాల్సి ఉండగా, కోవిడ్ పాండెమిక్ వలన వాయిదా పడింది. ఫైనల్ గా డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఓటిటిలో రిలీజయింది. తెలుగు, తమిళ్ లానే ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

ఆసిఫ్(అక్షయ్ కుమార్). దెయ్యాలు లేవని, అలా దెయ్యాలు ఉన్నాయని నమ్మించి బురిడీకొట్టించే బాబాల బాగోతం బట్టబయలు చేస్తుంటాడు. నిజంగా దెయ్యం అనేదే ఉంటే గాజులు తొడుక్కుంటానని స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఆసిఫ్ – రష్మీ(కియారా అద్వానీ)లది ప్రేమ వివాహం కావడం వలన గత మూడేళ్ళుగా రష్మీ వారి పుట్టింటికి దూరమై ఉంటుంది. ఒకరోజు రష్మీకి పుట్టింటి నుంచి కబురొస్తుంది, వెంటనే ఇద్దరూ వెళ్తారు. అక్కడ జరిగిన కొన్ని పరిస్థితుల వలన లక్ష్మీ ఆత్మ ఆసిఫ్ శరీరంలోకి వస్తుంది. అక్కడి నుంచి ఆసిఫ్ లైఫ్ లో జరిగిన మార్పులేమిటి? అసలు లక్ష్మీ ఎవరు? ఈనాడుకు ఆత్మగా తిరుగుతోంది? ఎలా ఆసిఫ్ బాడీ లోకి వచ్చింది? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

అక్షయ్ కుమార్ అటు హీరోగా మరో వైపు ట్రాన్స్ జెండర్ లక్ష్మీ పాత్రలో బాగానే చేసాడు. లేడీ గెటప్ లో ఉన్నప్పుడు బాగా అనిపించినా, నార్మల్ లుక్ లో ఉన్నప్పుడు పలికించిన లేడీ మ్యానరిజమ్స్ మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి. సరిగా చేయలేదని చెప్పాలి. కియారా అద్వానీకి ఉన్న స్క్రీన్ స్పేస్ తక్కువ కానీ ఉన్నంతలో బాగా చేసింది, ఒక ఎమోషనల్ సీన్ లో మెప్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లక్ష్మీ పాత్ర పోషించిన శరద్ కేల్కర్ సూపర్బ్ అనిపించాడు. ట్రాన్స్ జెండర్ పాత్రలో అన్ని షేడ్స్ ని పర్ఫెక్ట్ గా పలికింది అదరహో అనిపించుకున్నాడు. అశ్విని కల్సేకర్, అయేషా రజా మిశ్రాలు ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా నవ్విస్తారు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో ఓకే అనిపించారు.

తెర వెనుక టాలెంట్..

మొదటగా ఒరిజినల్ వెర్షన్ తీసిన రాఘవ లారెన్సేనా ఈ సినిమా తీసింది.. లేక ఇంకెవరైనా అసిస్టెంట్ తీసారా అన్నట్లు ఉంది ఈ లక్ష్మీ.. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ చూసినందువల్ల ఆ ఫీలింగ్ వచ్చిందనుకొని ఆ పాయింట్ ని పక్కన పెట్టేసి మిగతా విషయాలకి వద్దాం.. కాంచనలో మెయిన్ ప్లస్ పాయింట్ హీరోకి దెయ్యాలంటే భయం, కానీ ఇక్కడ దాన్ని రివర్స్ చేశారు.. అందువల్లే ఫస్ట్ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. అలాగే దాని వల్ల జెనరేట్ కావాల్సిన కామెడీ కూడా మిస్ అయ్యింది, దానికి బదులు వేసిన ట్రాక్ అస్సలు నవ్వించలేదు. ఇకపోతే అక్షయ్ లో దెయ్యం ఉందని ఫ్యామిలీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే సన్నివేశం బాగా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా మార్చారు, లక్ష్మీ లో కంటే ఒరిజినల్ వెర్షన్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుంది. అన్నిటికంటే మించి హార్రర్ ఎలిమెంట్స్ చూస్తే, ఎప్పుడో చిన్న పిల్లలప్పుడు చూసిన ఎఫెక్ట్స్ ఇప్పుడు చుపిస్తారేంటమ్మా అని ఫీల్ అవుతారు. చాలా చాలా డిస్కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా రాఘవ లారెన్స్ తన మ్యాజిక్ ని తానే రిపీట్ చెయ్యడంలో కంప్లీట్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.

ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ వెట్రి అండ్ కుష్ కలిసి మంచి విజువల్స్ అందించారు. పాటలు హిట్ అయినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా వెరీ బాడ్ అని చెప్పాలి. హార్రర్ ఎలిమెంట్స్ లో ఎక్కడా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా మ్యూజిక్ ఇవ్వలేదు. అలాగే హార్రర్ ఎలిమెంట్స్ ఏవీ భయపెట్టలేదు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. వరాల

విజిల్ మోమెంట్స్:

– అక్షయ్ కుమార్ లేడీ పెర్ఫార్మన్స్
– శరద్ కెల్కేర్ పెర్ఫార్మన్స్
– ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

బోరింగ్ మోమెంట్స్:

– హీరో క్యారెక్టర్ డిజైన్
– కామెడీ వర్కౌట్ కాకపోవడం
– బోరింగ్ కథనం
– నో హార్రర్ ఎలిమెంట్స్
– బాడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– వీక్ డైరెక్షన్
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

అక్షయ్ కుమార్ చేసిన ‘లక్ష్మీ’ ఓటిటిలో రిలీజయ్యింది కాబట్టి, ప్రస్తుతం ఓటిటి అన్ని భాషల వారికి అందుబాటులో ఉంది కాబట్టి భాషా పరంగా చూసుకుంటే.. హిందీ వారికి ఈ సినిమా గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టు కొంత భాగం బాగుందని అనిపించవచ్చు. కానీ మిగతా వారికి, లేదా ఒరిజినల్ వెర్షన్ చుసిన వారికి మాత్రం చాలా బాడ్ గా అనిపిస్తుంది. కాంచన తీసిన లారెన్స్ లక్ష్మీ తీయడంలో 10% కూడా ఆసక్తి చూపించినట్టు కనబడలేదు అంటే ఆశర్యపోనక్కర్లేదు. ఈ దీపావళికి తుస్సు మన్న పటాకా ఈ ‘లక్ష్మీ’ బాంబ్.

చూడాలా? వద్దా?: చూడని వారికైనా ఈ హార్రర్ ని భరించడం కష్టమే.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...